Messenger video calls : వీడియో కాల్స్‌తో మెసెంజర్‌లో గేమ్స్ ప్లే
ABN, First Publish Date - 2023-04-07T23:16:22+05:30
మెసెంజర్‌కు కొత్తగా గేమింగ్ ఫీచర్‌ను ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్లాట్‌ఫారంపై 14 గేమ్స్ ఉన్నాయి. బాంబే ప్లేకు చెందిన కార్డ్‌వార్స్,
మెసెంజర్‌కు కొత్తగా గేమింగ్ ఫీచర్‌ను ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్లాట్‌ఫారంపై 14 గేమ్స్ ఉన్నాయి. బాంబే ప్లేకు చెందిన కార్డ్‌వార్స్, కోట్‌సింక్ - ఎక్స్‌ప్లోడింగ్ కిట్టెన్స్ వంటివి ఉన్నాయి. ఈ ఆటలు దేనికది ఎంతమంది ఆడుకోవచ్చు చెబుతోంది. అయితే ఎక్కువ ఆటలు కేవలం ఇద్దరు మాత్రమే ఆడగలరు. అలాగే వీడియో కాల్‌తో పాటు గేమ్స్‌లో పాల్గొనవచ్చు. ఇందుకోసం
మొదట లేటెస్ట్ వెర్షన్ మెసెంజర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ అలాగే స్నేహితులు కూడా డౌన్‌లోడ్ చేసుకునేలా చూసుకోవాలి.
మెసెంజర్ యాప్ ఓపెన్ చేసి కనీసం ఒకరితో వీడియో కాల్ ఆరంభించాలి.
అవతలి వ్యక్తి చేరిన తరవాత గ్రూప్ మోడ్ బటన్‌ని టాప్ చేయాలి.
ప్లే ఐకాన్‌ను టాప్ చేయాలి.
అందుబాటులో ఉన్న గేమ్ చూసుకుని టాప్ చేయాలి. తదుపరి ఆట ఆరంభించాలి.
మెసెంజర్ యాప్‌లో వీడియో కాల్ స్ర్కీన్ చిన్నది రెండూ టాప్‌లో ఒకటవుతాయి.
Updated Date - 2023-04-07T23:16:22+05:30 IST