ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Palleru treatment: పల్లేరు చికిత్స ఇలా...

ABN, First Publish Date - 2023-02-07T02:34:46+05:30

పెద్ద, చిన్న పల్లేరు కాయలతో వ్యాధులకు చికిత్స చేయవచ్చు. అందుకోసం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆయుర్వేదం

పెద్ద, చిన్న పల్లేరు కాయలతో వ్యాధులకు చికిత్స చేయవచ్చు. అందుకోసం...

మెదడు వాపు వ్యాధి:

20 గ్రాముల పల్లేరును దంచి, 40 మిల్లీ లీటర్ల నీటిలో ఉడికించాలి. 10 మిల్లీ మీటర్లకు నీళ్లు ఇగిరిన తర్వాత వడగట్టి, తాగించాలి. ఇలా చేస్తే జలుబు, తలలో నీరు, ఉన్మాదం, హిస్టీరియా, మూర్ఛ, తల తిరుగుట లాంటి రుగ్మతలు నయం అవుతాయి.

నేత్ర వ్యాధులు:

దీని రసం కంట్లో వేస్తే కంటి వ్యాధులు హరిస్తాయి. పచ్చి ఆకులు దంచి, కళ్లపై పట్టు వేస్తే కళ్లకలక తగ్గుతుంది.

ముక్కు వ్యాధులు:

దీని తైలం ముక్కులో వేస్తే, చెమ్మ లేకపోవడం, రక్తం కారడం, ముక్కులో పుండ్లు నయం అవుతాయి.

నోటి వ్యాధులు:

పల్లేరు చూర్ణానికి నీళ్లు జోడించి, కాచి, వడగట్టి ఆ నీటితో నోరు పుక్కిలించాలి. ఇలా చేస్తే చిగుళ్ల వ్యాధులు, నోటి దుర్గంధం తగ్గుతాయి.

కంఠ వ్యాధులు:

దీని కషాయంతో పుక్కిలించి, ఉమ్మి వేస్తే గొంతు వాపు, నొప్పి తగ్గుతాయి. 20 గ్రాముల పల్లేరు కాయల్లో అర లీటరు నీళ్లు పోసి, పావు వంతుకు కుదించుకుపోయేవరకూ మరిగించి రోజుకు నాలుగు సార్లు తాగుతూ ఉంటే, మింగడంలో ఇబ్బందులు తొలుగుతాయి. డిఫ్తీరియా కూడా నయం అవుతుంది.

శ్వాసకోశ వ్యాధులు:

దీని కషాయం స్వరభంగమును మారుస్తుంది. శ్లేష్మం విడుదల అయ్యేలా చేస్తుంది.

దగ్గు, ఛాతీలో భారాన్ని తగ్గించి, తేలికగా శ్వాస అందేలా చేస్తుంది. కఫం త్వరగా బయటకు వచ్చేయాలంటే

ఈ కషాయంలో కొద్దిగ నెయ్యి కలుపుకుని తీసుకోవాలి.

Updated Date - 2023-02-07T02:34:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising