‘నథింగ్’ ట్రాన్స్‌పరెంట్ యూఎ్‌సబి - సి కేబుల్
ABN, First Publish Date - 2023-06-24T01:13:55+05:30
థింగ్ సరికొత్త డిజైన్‌తో యూఎ్‌సబి టైప్ - సి కేబుల్‌ను తీసుకు వస్తోంది. రెండో ఫోన్ వచ్చే నెలలో రానుంది. ఈ నేపథ్యంలోనే సంబంధిత సి కేబుల్ ఇమేజ్‌ను ప్రదర్శించింది.
నథింగ్ సరికొత్త డిజైన్‌తో యూఎ్‌సబి టైప్ - సి కేబుల్‌ను తీసుకు వస్తోంది. రెండో ఫోన్ వచ్చే నెలలో రానుంది. ఈ నేపథ్యంలోనే సంబంధిత సి కేబుల్ ఇమేజ్‌ను ప్రదర్శించింది. సిల్వర్ ఫినిషింగ్‌కు తోడు ట్రాన్స్‌పరెంట్ ఔటర్ షెల్ ఇది. నథింగ్‌కు చెందిన ట్రాన్స్‌పరెంట్ డిజైన్ లాంగ్వేజ్‌కు ఇది అద్దంపడుతోంది. మొదటి ఫోన్ మాదిరిగానే కేబుల్ తెలుపు రంగులో ఉంది. నథింగ్ బ్రాండింగ్‌గా కూడా దీన్ని పేర్కొనవచ్చు. రెండో ఫోన్ ప్యాకేజ్‌లోనూ చార్జర్ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. మొదటి ఫోన్‌తో పాటు 45 వాట్స్ పీడీ వాల్ చార్జర్‌ను అమ్ముతోంది. 33 వాట్స్ పీడీ చార్జింగ్‌కు అది సానుకూలం. ఆ నేపథ్యంలో రెండో ఫోన్ విషయంలో చార్జింగ్ వేగం పెంచవచ్చని అనుకుంటున్నారు. రెండో ఫోన్‌ను జూలై 11న విడుదల చేస్తున్నారని సమాచారం. మొదటి దానితో పోల్చుకుంటే అప్‌గ్రెడేషన్ ఉంటుంది. డిస్‌ప్లే పెద్దగా ఉండటమే కాకుండా మెదటి జనరేషన్ మోడల్‌తో పోల్చుకుంటే కార్బన్ ప్రింట్ తక్కువగా ఉంటుంది. రెండో ఫోన్‌తో కలిపి ఔస్ 2.0ని కూడా విడుదల చేస్తున్నారు.
Updated Date - 2023-06-24T01:13:55+05:30 IST