ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Subshitaum: సకలార్థ సాధనం సుభాషితం

ABN, First Publish Date - 2023-03-02T23:26:42+05:30

ఉత్తములైన వ్యక్తులతో చేసే చెలిమి వల్ల కలిగే ప్రయోజనాలను భర్తృహరి తన నీతి శతకంలోని ఈ శ్లోకంలో వివరించాడు. దాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జాడ్యం ధియో హరతి సించతి వాచి సత్యం

మానోన్నతిం దిశతి పాప మపాకరోతి

చేతః ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం

సత్సంగతిః కథయ కిం న కరోతి పుంసామ్‌!!

ఉత్తములైన వ్యక్తులతో చేసే చెలిమి వల్ల కలిగే ప్రయోజనాలను భర్తృహరి తన నీతి శతకంలోని ఈ శ్లోకంలో వివరించాడు. దాన్ని...

సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు

గౌరవమొసంగు జనులకు కలుషమడచు

కీర్తి ప్రకటించు చిత్తవిస్ఫూర్తి జేయు

సాధుసంగంబు సకలార్థ సాధనంబు

అంటూ తెలుగువారికి అందించాడు ఏనుగు లక్ష్మణకవి.

‘‘మంచి వ్యక్తులతో స్నేహం... ఎప్పుడూ సత్యమే పలికేలా చేస్తుంది. బుద్ధి మాంద్యాన్ని తొలగిస్తుంది. జ్ఞానాన్ని పెంచుతుంది. సమాజంలో గౌరవాన్ని కలిగిస్తుంది. కల్మషాలను పోగొడుతుంది. మనసును నిర్మలంగా ఉంచుతుంది. పేరు ప్రతిష్టలు పెరిగేలా చేస్తుంది. మనోవికాసాన్ని కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే... సజ్జనులైన వారి సాంగత్యం సకలార్థ సాధనం’’ అని అర్థం.

Updated Date - 2023-03-02T23:26:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!