ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

OnePlus : మెకానికల్‌ కీబోర్డ్‌

ABN, First Publish Date - 2023-07-21T23:25:11+05:30

వన్‌ప్లస్‌ ఈ ఏడాది ఆరంభంలోనే తన మొదటి మెకానికల్‌ కీబోర్డ్‌ని ఆరంభించింది. ప్రస్తుతం దాని ధరను తెలిపింది. అల్యూమినియంతో దీనిని రూపొందించారు. స్వాపబుల్‌ కీక్యాప్స్‌, వన్‌ప్లస్‌ కో-క్రియేటెడ్‌ స్విచ్‌లు

వన్‌ప్లస్‌ ఈ ఏడాది ఆరంభంలోనే తన మొదటి మెకానికల్‌ కీబోర్డ్‌ని ఆరంభించింది. ప్రస్తుతం దాని ధరను తెలిపింది. అల్యూమినియంతో దీనిని రూపొందించారు. స్వాపబుల్‌ కీక్యాప్స్‌, వన్‌ప్లస్‌ కో-క్రియేటెడ్‌ స్విచ్‌లు ఉన్నాయి. ఆగస్ట్‌ 7 నుంచి డార్క్‌ గ్రే, లైట్‌ గ్రే రంగుల్లో లభ్యమవుతున్న దీని ధర రూ.17,999. వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. కీబోర్డ్‌ 81 నిర్మాణంలో సంబంధిత మాన్యుఫాక్చరింగ్‌ సంస్థ కీచ్రాన్‌తో చేతులు కలిపింది. కనెక్టివిటీ ప్రొటోకాల్‌ను కూడా కీచ్రాన్‌ అందించింది. మేక్‌ ఓఎస్‌తో పాటు విండోస్‌, లినక్స్‌ సిస్టమ్స్‌కు సానుకూలతను కలిగించింది. 81-కీ లేఔట్‌ మాదిరిగా ఉంది. అయితే రెడ్‌ అండ్‌ వైట్‌ యాక్సెంట్‌, సీఎన్‌సీ - మెషిన్డ్‌ అల్యూమినియం, వన్‌ప్లస్‌ ఫోన్లలో మాదిరిగా ఐకానిక్‌ అలర్ట్‌ స్లయిడర్స్‌ను కూడా కలిపింది. కీస్ట్రోక్‌ మన్నిక ఎక్కువగా ఉండేందుకు మార్బుల్‌ మెల్లో కీ క్యాప్స్‌ను అమర్చింది. దీంతో వేగం పెరగడమే కాకుండా టైపింగ్‌ అనుభవం సాఫీగా ఉంటుంది. వింటర్‌ బోనఫైర్‌, సమ్మర్‌ బ్రీజ్‌ పేరిట ఉన్న రెండు స్విచ్‌ ఆప్షన్స్‌లో ఏదో ఒకటి యూజర్‌ ఎంచుకోవచ్చు. విజువల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ మెరుగ్గా ఉండేందుకు ఆర్‌జీబీ లైటింగ్‌ ఉంది. ఓపెన్‌సోర్స్‌ ఫర్మ్‌వేర్‌ని సపోర్ట్‌ చేస్తుంది. 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సపోర్ట్‌ ఉంది. ఆర్‌జీబీ లైటింగ్‌ యాక్టివ్‌తో వంద గంటల సేపు ఉపయోగించుకోవచ్చు.

Updated Date - 2023-07-21T23:25:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising