ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cow Honesty: ఆవు నిజాయితీ!

ABN, First Publish Date - 2023-04-24T22:40:21+05:30

ఒక ఊరిలో ఒక నిజాయితీ ఆవు ఉండేది. అది తన బిడ్డకు పాలు ఇచ్చి ప్రతి రోజూ అడవిలోకి మేయటానికి వెళ్లేది. దారిలో ఓ గేదె ఎదురొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక ఊరిలో ఒక నిజాయితీ ఆవు ఉండేది. అది తన బిడ్డకు పాలు ఇచ్చి ప్రతి రోజూ అడవిలోకి మేయటానికి వెళ్లేది. దారిలో ఓ గేదె ఎదురొచ్చింది. దయచేసి అడవిలోకి వెళ్లకు.. ఓ పులి తిరగాడుతున్నది. జాగ్రత్త అంటూ సలహా చెప్పింది. పైగా తాను పులి గాండ్రింపు విన్నానని చెప్పింది. సరే..నంటూ కొంచెం ముందుకు వెళ్లిందో లేదో పొదలచాటున నుంచి ఓ పులి వచ్చి ఆవు మీదకు దూకింది. దూకడం కూడా దాని మెడ మీదకు దూకింది.

పులిగారూ.. దయచేసి నా మాట వినండి అన్నది. ‘విషయమేంటీ?’ అనడిగింది. ‘నా ఇంటి దగ్గర బిడ్డ ఉంది. ఆ చంటిదూడ నేను గడ్డి తిని ఇంటికి వెళితే ఎగిరెగిరి సంతోషపడుతుంది. పాలు తాగుతుంది. పాలు తాగిన తర్వాత నేను వస్తాను. తర్వాత నన్ను తిను’ అన్నది. ఆ మాటలు విన్న తర్వాత పులి కరిగిపోయింది. సరేనన్నది. ఆవు మేత మేసి ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్లిన తర్వాత నీళ్లు తాగింది. బిడ్డకు పాలు ఇచ్చింది. ఎన్నో బుద్ధులు చెప్పింది. ఎవరి చెడు తోడు పట్టకు అన్నది. ‘నేను వచ్చినా రాకున్నా.. బాధపడకు. నీ పని నువ్వు చేసుకో. నీ తిండి నువ్వు తిను. జాగ్రత్తగా మసలుకో’ అంటూ బాధతో మాట్లాడింది. తిరిగి అడవిలోకి బయలుదేరింది.

రాత్రి సమయం అవుతోంది.. జాగ్రత్త అడవిలోకి అంటూ మిగిలిన ఆవులు, గేదెలు అన్నవి. ఆ మాటలేవి పట్టించుకోకుండా అడవిలోకి వెళ్లింది. పులి దగ్గరకు వెళ్లింది. ఇచ్చిన మాట మీద నిలబడిన ఆవును చూసి పులికి జాలేసింది. ఇంత నిజాయితీ ఉన్న ఆవును తింటే.. తన బిడ్డకు తీరని ద్రోహమే అవుతందని అనుకుంది. ‘ఇంటికి వెళ్లి నీ బిడ్డతో బతుక్కో’ అంటూ విడిచిపెట్టింది ఆ పులి.

Updated Date - 2023-04-24T22:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising