ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశపోతు వేటగాడు

ABN, First Publish Date - 2023-04-21T23:16:07+05:30

ఒక ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు. ఆశపోతు. ఉన్నదానికి ఎప్పుడూ సంతృప్తి పడేవాడు కాదు. ఒక రోజు అడవికి వెళ్లాడు. ఒక జింకను పులి తరుముతూ వస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు. ఆశపోతు. ఉన్నదానికి ఎప్పుడూ సంతృప్తి పడేవాడు కాదు. ఒక రోజు అడవికి వెళ్లాడు. ఒక జింకను పులి తరుముతూ వస్తోంది. ఒక చెట్టుమీద నక్కి ఆ వేటగాడు వల వేశాడు. ఆ జింక వచ్చి ఆ వలలో చిక్కుకున్న వెంటనే క్షణాల్లో పైకి లాగాడు ఆ వలను. ఆ జింక అలా ఆ పులి నుంచి తప్పించుకుంది. తన దగ్గర ఉన్న బాణాలతో పులి కాళ్లకు వదిలాడు. ఆ పులి భయపడి పారిపోయింది.

జింకను మెల్లగా వలలోంచి తీశాడు. విచిత్రంగా ఆ జింక మాట్లాడుతోంది. బంగారు రంగులో, తెల్లని చిన్నటి చారలు ఉండే ఆ జింక దేవుడేమో అని భావించి మొక్కాడు. ‘నువ్వు నన్ను రక్షించావు. నేను మామూలు జింకనే. అయితే మాట్లాడేవారికి మాత్రమే వరాలు ఇవ్వగలను’ అన్నది. ఆ వేటగాడు విచిత్రంగా చూశాడు. ‘ఏమి కావాలి నరుడా?’ అని అడిగింది జింక. ‘నాకు ఓ పెద్ద ఇల్లు కావాలి’ అన్నాడు. అన్నట్లే ఓ ఇల్లు ఆ ఊరిలో వచ్చింది. వెళ్లి చూసుకో ఇల్లు అన్నది. వేటగాడు ఆతృతతో వెళ్తే పెద్ద ఇల్లు ఉంది. అక్కడ సంతోషంగా ఉన్నాడు. మరొకరోజు తనకు ధనం కావాలని ఆశ పుట్టింది. ఆ చెట్టు దగ్గరకు వెళ్లి ప్రార్థించాడు జింకను. క్షణాల్లో ప్రత్యక్షమైంది. ‘ఏమి కావాలో కోరుకో’ అన్నది. ‘నా ఇంట్లో ధనం తరగకూడదు’ అని అడిగాడు. అలానే అంటూ వరమిచ్చింది. ఆ తర్వాత తన భార్యతో విలాసాలు అనుభవిస్తూ గడిపాడు. అంతలోనే మరో ఆశ పుట్టింది వేటగాడికి.

రోసారి జింక దగ్గరకు వెళ్లి మూడో వరాన్ని అడిగాడు. కోరుకోమంది బంగారు జింక. ‘నేను కోరుకున్న వెంటనే దేవుళ్లు కూడా బానిసలుగా పని చేయాల’ని కోరుకున్నాడు. అతని కోరికకు కోప్పడి ఆ బంగారు జింక వేటగాడికి శాపం ఇచ్చింది. దేవుళ్లనే బానిసలుగా చేయాలనే ఆలోచన తప్పు. నువ్వు ఎల్లకాలం దేవున్ని పూజిస్తూ ఉండే పేదవాడిగా ఉండు.. ఈ చెట్టు కిందనే జీవితం అంటూ శపించింది. ఆ రోజునుంచి ఆ వేటగాడు అష్టదరిద్రుడిలా ఉండిపోయాడు. దురాశ దుఖానికి చేటని ఆ తర్వాత వేటగాడికి తెలిసినా లాభం లేకపోయింది.

Updated Date - 2023-04-21T23:16:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising