ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జబర్దస్ట్‌... జాకెట్‌ లెహంగా

ABN, First Publish Date - 2023-05-31T23:49:52+05:30

డిజైనర్‌ లెహంగాల ఆకర్షణే వేరు. అయితే ఈ లెహంగాలకు మోడర్న్‌ టచ్‌ ఇచ్చే జాకెట్‌ను జోడిస్తే, అవి మరింత వినూత్నంగా కనిపిస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిజైనర్‌ లెహంగాల ఆకర్షణే వేరు. అయితే ఈ లెహంగాలకు మోడర్న్‌ టచ్‌ ఇచ్చే జాకెట్‌ను జోడిస్తే, అవి మరింత వినూత్నంగా కనిపిస్తాయి. కాబట్టే ఇప్పుడు జాకెట్‌ లెహంగాలు లేటెస్ట్‌ ఫ్యాషన్‌గా మారాయి. వాటి మీద ఓ లుక్కేద్దామా!

సెక్విన్స్‌, బీడ్స్‌, స్టోన్స్‌

మిరుమిట్లు గొలిపే నియాన్‌ వెలుగుల్లో మెరుపు తీగలా వెలిగిపోవడం కోసం జాకెట్‌ లెహంగాల తయారీలో సెక్విన్‌, బీడ్స్‌, స్టోన్స్‌ వాడకానికి ప్రాధాన్యం ఇవ్వాలి. జరీ, బుటా లాంటివి కూడా లెహంగాలకు మెరుపునిస్తాయి. అయితే పనితనం పెరిగేకొద్దీ లెహంగా, జాకెట్లు బరువుగా మారి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి అవసరానికి తగ్గట్టు సౌకర్యంగా ఉండే జాకెట్‌ లెహంగాలనే ఎంచుకోవాలి.

నిండుగా, హూందాగా...

గాగ్రా చోళీ, లెహంగాలు సర్వసాధారణమైపోయాయి. పెళ్లిళ్లు, ఎంగేజ్‌మెంట్‌ పార్టీలు లాంటి వేడుకల్లో భిన్నంగా కనిపించాలనుకుంటే వెరైటీగా ఉండే దుస్తులనే ఎంచుకోవాలి. నిండుగా, హూందాగా అదే సమయంలో ఎట్రాక్టివ్‌గా కనిపించడం కోసం జాకెట్‌ లెహంగాలను ఎంచుకోవచ్చు.

చున్నీలూ ప్రధానమే!

జాకెట్‌ ఉన్నంత మాత్రాన చున్నీ అవసరం లేదనుకుంటే పొరపాటు. జాకెట్‌ లెహంగాలతో పాటు అంతే ఆకర్షణీయంగా ఉండే చున్నీకి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. జాకెట్‌, లెహంగా కాంట్రాస్ట్‌ కలర్స్‌లో ఉంటే, లెహంగా రంగుతో మ్యాచ్‌ అయ్యే చున్నీనే ఎంచుకోవాలి. ఒకవేళ డ్రస్‌ మొత్తం ఒకే రంగులో ఉంటే, అదే రంగు చున్నీని ఎంచుకోవాలి.

Updated Date - 2023-06-01T05:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising