ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hrithiks Wedding : హృతిక్‌ పెళ్లి.. ఈ యేడాదేనట!

ABN, First Publish Date - 2023-03-05T00:00:50+05:30

బాలీవుడ్‌లో రోజుకో పెళ్లి కబురు వినిపిస్తోంది. కియారా అద్వాణీ, స్వర భాస్కర్‌, అతియా శెట్టి... పెళ్లిళ్లు చేసుకొన్నారు. వారి వివాహ వార్తలు, కవరేజీలతో బాలీవుడ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బాలీవుడ్‌లో రోజుకో పెళ్లి కబురు వినిపిస్తోంది. కియారా అద్వాణీ, స్వర భాస్కర్‌, అతియా శెట్టి... పెళ్లిళ్లు చేసుకొన్నారు. వారి వివాహ వార్తలు, కవరేజీలతో బాలీవుడ్‌ మీడియా హోరెత్తిపోయింది. ఈసారి హృతిక్‌ రోషన్‌ పెళ్లంటూ బాలీవుడ్‌లో పెద్ద హడావిడి జరుగుతోంది. కొంతకాలంగా నటి, గాయని సబా ఆజాద్‌తో సహ జీవనం చేస్తున్నాడు హృతిక్‌. మొదట్లో ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని ప్రయత్నించారు. కానీ ఏదోలా బయటకు వచ్చేసింది. ఆ తరవాత సినిమా ఫంక్షన్లు, పార్టీలలో వీరిద్దరూ జంటగానే దర్శనమివ్వడం మొదలెట్టారు. దాంతో వీరి డేటింగ్‌ వ్యవహారం ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ యేడాది చివర్లో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటవ్వాలని నిర్ణయించుకొన్నార్ట. ఈలోగా చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేయాలని చూస్తున్నాడు హృతిక్‌. పెళ్లయ్యాక మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నాడని, అందుకే వీలైనంత త్వరగా సినిమాల్ని పూర్తి చేస్తున్నాడని, కొత్త కథలేవీ వినడానికి ఇష్టపడడం లేదని ఇన్‌సైడ్‌ వర్గాల టాక్‌. పెళ్లి విషయమై రాకేశ్‌ రోషన్‌ని ప్రశ్నిస్తే ఆయన సమాధానమేమీ ఇవ్వడం లేదు. ‘‘వారిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుసు. కానీ పెళ్లి విషయం మాత్రం నన్ను అడక్కండి. నేనేం చెప్పలేను’’ అంటూ సమాధానం దాటేస్తున్నారు. హృతిక్‌కి ఇది రెండో పెళ్లి. మొదటి భార్య సుజేన్‌ ఖాన్‌కు ఆయన ఇది వరకే విడాకులు ఇచ్చారు.

Updated Date - 2023-03-05T00:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising