ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలతో ఆనందంగా...

ABN, First Publish Date - 2023-05-25T00:11:41+05:30

పేరెంట్స్‌కు ఒత్తిడి ఉన్నట్లే పిల్లలకూ ఒత్తిడి ఉంటుంది. వేసవి సెలవుల్లో పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. ఫోన్లు, ట్యాబ్స్‌ , టీవీల స్ర్కీన్‌ సమయాన్ని తగ్గించి.. వారిలో శారీరక, మానసిక బలాల్ని కలిగించాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేరెంట్స్‌కు ఒత్తిడి ఉన్నట్లే పిల్లలకూ ఒత్తిడి ఉంటుంది. వేసవి సెలవుల్లో పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. ఫోన్లు, ట్యాబ్స్‌ , టీవీల స్ర్కీన్‌ సమయాన్ని తగ్గించి.. వారిలో శారీరక, మానసిక బలాల్ని కలిగించాలంటే.. కచ్చితంగా కొంత సమయం కేటాయించాల్సిందే. వేసవి సెలవులే పిల్లలకు మధుర జ్ఞాపకాలు. ఇంతకీ వేసవిలో పిల్లలతో ఎలా సరదాగా గడపవచ్చో తెల్సుకుందాం...

వేసవిలో పిల్లలతో కలసి ఎంజాయ్‌ చేయాలంటే అందుకు తగినట్లు ప్లాన్‌ చేసుకోవాలి. బీచ్‌లకు వెళ్లటం, చల్లని ప్రదేశాల్లో గడపటం, జూ.. లాంటి ప్రదేశాలకు తీసుకెళ్తే ఫన్‌ ఉంటుంది.

పక్షుల దగ్గరకు తీసుకెళ్లి వాటి గురించి వివరించొచ్చు. కొత్తగా ఫీలవుతారు. ఇంటి దగ్గరే పక్షులకు ఫీడ్‌ పెట్టడం, నీళ్లను నిల్వ చేయటం వల్ల పక్షులు వచ్చిపోతుంటాయి.

పేరెంట్స్‌ ఉద్యోగ పనుల్లో ఉన్నా.. ఈ సమయంలో పిల్లలకు సమయం కేటాయించి ఈతనేర్పించటం, గేమ్స్‌ ఆడించటం, పెయింటింగ్‌ క్లాసులకు తీసుకెళ్లటం.. లాంటివి చేయాలి. దీనివల్ల మరింత ఎనర్జీగా ఉంటారు పిల్లలు.

చదువులనుంచి కాస్త విశ్రాంతి తీసుకుని జీవితాన్ని సంతోషంగా గడిపితే పిల్లల్లో పాజిటివ్‌నెస్‌ పెరుగుతుంది. లోపల ఉండే ఒత్తిడి తగ్గుతుంది.

స్ర్కీన్‌ సమయం తగ్గించి కాస్త యాక్టివిటీస్‌తో పాటు చదివే గుణాన్ని పిల్లల్లో అలవర్చాలి. ముఖ్యంగా జీవితచరిత్రలు, పర్సనల్‌ ఫైనాన్స్‌ లాంటి పుస్తకాలు చదివేట్లు ప్రోత్సహించాలి.

సినిమాలకు తీసుకెళ్లటం.., మట్టితో బొమ్మలు చేయించటం.. లాంటి ఫన్‌ యాక్టివిటీస్‌ను చేయించాలి.

చేపలు పట్టే ప్రాంతాలకు తీసుకెళ్లాలి. గాలిపటాల్ని ఎగరేయాలి.

సంగీతం నేర్చించటం, వంటపూ ఆసక్తి కలిగించటం చేయాలి.

చివరగా వేసవి సెలవులు పూర్తయ్యేప్పుడు వేసవి మధురక్షణాలను ఫొటోఫ్రేమ్‌ కట్టించాలి.

Updated Date - 2023-05-25T00:11:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising