ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మేక తెలివి

ABN, First Publish Date - 2023-09-12T00:09:56+05:30

మేకలకు తెలివి ఉండదంటారు. అయితే ఓ మేక మాత్రం తెలివైనది. ఒకరోజు కాపరి దగ్గరి నుంచి, మందలోంచి విడిపోయి తప్పిపోయింది.

మేకలకు తెలివి ఉండదంటారు. అయితే ఓ మేక మాత్రం తెలివైనది. ఒకరోజు కాపరి దగ్గరి నుంచి, మందలోంచి విడిపోయి తప్పిపోయింది. ఎంత అరచినా ఎవరూ కనపడలేదు. క్షణాల్లో గడ్డి చాటునుంచి ఓ పులి తన మీదకు దూకింది. దీంతో మేక ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పని అయ్యింది. నా మాట విను.. ఓ సత్యం చెబుతాను అన్నది. అసలే పెద్దగా ఆకలి లేని ఆ పులి ‘సరే’ అని మేకను విడిచి పెట్టింది. ఎదురెదురుగా ఉన్నాయి.

ఎదురుగా ఉండే పులి కోపంతో ఉన్నది. శాంతించమని కోరింది మేక. మూడు నిజాలు చెబుతాను. అవి నిజం కాదు అనిపిస్తే మాత్రం వదిలేయి. లేకపోతే నన్ను తినేయి అన్నది. ఇదేదో బావుందేనని సవాల్‌ విసిరింది పులి. ‘మీరు పులుల గుంపులో ఉన్నప్పుడు.. ఓ మేక దొరికితే విడిచిపెట్టాను’ అని చెబితే ఎవరూ నమ్మరు కదా! అనడిగింది. ‘నిజమే’ అన్నది పులి. ఇక రెండో నిజం చెప్పనా అన్నది మేక. చెప్పమని తలూపింది పులి. ‘ఏమీ లేదు.. ఒకవేళ నేను బతికి బట్టకట్టి.. నా గుంపుతో- నన్ను పులి విడిచిపెట్టింది. ఒంటరిగా ఉన్నా ఏమీ అనలేదంటే నమ్మవు కదా!’ అనడిగింది మేక. ఎవరూ నమ్మరు అంటూ తలూపింది పులి. ఇక నేను ఎదురుచూడలేను మూడో నిజమేమిటి? అని అడిగింది పులి.

అక్కడికే వస్తున్నా.. ‘ఇంతసేపు నాతో ముచ్చటిస్తున్నావు అంటే నిజంగా నీకు ఆకలి లేదు కదా!’ అని అడిగింది మేక. అవును నిజమే.. బతికిపోయావ్‌ అన్నది పులి. అంతటితో ఊరుకోకుండా పులి ఇలా అన్నది.. ‘నీకు ఓ విషయం తెలుసా. ఈసారి నిన్ను మాట్లాడించేది ఉండదు. దొరుకుతూనే ప్రాణం తీసేస్తా. ఇది కూడా నిజమే’ అన్నది పులి. ‘అయ్యా.. మీకు ఓ నిజం చెప్పాలి. ఈ సారి మీకు దొరకనంటే దొరకను’ అంటూ అక్కడనుంచి తుర్రుమంది మేక.

Updated Date - 2023-09-12T01:39:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising