Giant River Otter : మీకు తెలుసా?
ABN, First Publish Date - 2023-07-20T23:13:18+05:30
నల్లగా పొడవుగా ముంగిసలా ఉండే ఈ జంతువును ‘గైంట్ రివర్ ఒట్టర్’ అని పిలుస్తారు. ఇది అమెజాన్‌లో మంచినీటి సరస్సులు, నదుల్లో జీవిస్తాయి.
నల్లగా పొడవుగా ముంగిసలా ఉండే ఈ జంతువును ‘గైంట్ రివర్ ఒట్టర్’ అని పిలుస్తారు. ఇది అమెజాన్‌లో మంచినీటి సరస్సులు, నదుల్లో జీవిస్తాయి.
ఇవి పండ్లు, ఆకులను తింటాయి. దీంతో పాటు చేపలను బాగా తింటాయి.
చిరుతపులిలా వేగంగా కదులుతాయి. నీళ్ల పక్కన పడిపోయిన చెట్ల దుంగల మధ్య నివసించటానికి ఇష్టపడతాయి.
దక్షిణఅమెరికాలో అధికంగా కనిపిస్తాయివి. తోక 27 ఇంచుల పొడవు ఉండటం వల్ల నీళ్లలో వేగంగా ఈదగలవు.
ఇవి సోషల్ అనిమల్స్. కలసి ఆడుకుంటాయి. తింటాయి. ఒక్కో గుంపులో కనీసం పది జంతువులు ఉంటాయి. వేటాడటానికి కూడా గుంపుగా వెళ్తాయి.
చిరుతపులులు, పెద్ద పాములకు భయపడతాయి. ఇవి దగ్గరలో ఉన్నట్లు అనిపిస్తే విచిత్రంగా అరుస్తాయి. మిగతా వాటిని అలర్ట్ చేస్తాయి. కనీసం 15 రకాలుగా వీటి అరుపులు ఉంటాయి.
అతి పెద్ద గైంట్ రివర్ ఒట్టర్ 1.8 మీటర్లు ఉంటుంది. అలాగే చిన్న ఒట్టర్స్ పెద్ద ఎలుకలంత సైజ్‌లో కూడా కొన్ని ఉంటాయి.
ఒకేసారి రెండు లేదా మూడు పిల్లలను కంటాయి. పిల్లిమాదిరే పిల్లలను స్థలం మారుస్తుంటాయి.
స్పెయిన్‌లో ఈ జంతువును వాటర్ డాగ్, వాటర్ జాగ్వర్, రివర్ ఊల్ఫ్ అని కూడా పిలుస్తారు.
Updated Date - 2023-07-20T23:13:18+05:30 IST