ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Facepax : వేపతో ఫేస్‌ప్యాక్స్‌!

ABN, First Publish Date - 2023-01-24T23:03:20+05:30

వేపాకులో ఔషధ గుణాలెన్నో. దీంతో పాటు బ్యూటీ ప్రొడక్ట్స్‌లో వేపను వాడుతున్నారు. మొటిమలు, మచ్చలు పోవాలంటే నీమ్‌తో చేసిన సోప్స్‌ ఉపయోగిస్తారు. డాండ్రఫ్‌ పోవాలంటే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేపాకులో ఔషధ గుణాలెన్నో. దీంతో పాటు బ్యూటీ ప్రొడక్ట్స్‌లో వేపను వాడుతున్నారు. మొటిమలు, మచ్చలు పోవాలంటే నీమ్‌తో చేసిన సోప్స్‌ ఉపయోగిస్తారు. డాండ్రఫ్‌ పోవాలంటే షాంపూలున్నాయి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే వేపాకుతో ఇంట్లోనే ఈ ఫేస్‌ప్యాక్స్‌ తయారుచేసుకోవచ్చిలా...

  • ముఖంలో జిడ్డు అధికంగా ఉంటే.. రెండు టీస్పూన్లు వేపాకు పౌడర్‌, రెండు టీస్పూన్ల రోజ్‌వాటర్‌, టీ స్పూన్‌ నిమ్మరసం కలిపి బాగా మిక్స్‌ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి ఆరేంత వరకూ ఉంచి కడిగేయాలి. ఇలా చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. ముఖం మీద నొప్పులు పోతాయి.

  • అదే పొడిచర్మం వారైతే గుప్పెడు వేపాకులను బాయిల్‌ చేయాలి. వాటిని పేస్ట్‌ చేయాలి. ఆ తర్వాత దీనికి ఒక టీస్పూన్‌ పసుపు, టీస్పూన్‌ రిఫైన్‌ చేయని కొబ్బరినూనె జత చేయాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిముషాలు ఉంచి కడిగేయాలి. ఇలా చేస్తుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

  • ఒక టీస్పూన్‌ వేపాకు చూర్ణానికి, రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు కలిపి మిక్స్‌ చేసి ముఖానికి పట్టిస్తే డార్క్‌స్పాట్స్‌ అంతరించిపోతాయి.

  • పది వేపాకులు తీసుకుంటే అన్నే తులసాకులు తీసుకోవాలి. వీటిని పేస్ట్‌ చేసుకోవాలి. ఈ పేస్ట్‌కు అరకప్పు ముల్తాన్‌ మట్టి, టేబుల్‌ స్పూన్‌ తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని స్క్రబ్‌లా ముఖానికి రుద్దుతూ పట్టించాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది.

  • ఒకవేళ ఏమీ ఇంగ్రిడియంట్స్‌ లేకున్నా పర్లేదు వేపాకు చూర్ణాన్ని మాత్రమే ముఖానికి పడుకునేముందు పట్టించుకుని నిద్రపోవాలి. వేపాకు పీహెచ్‌ వాల్యూని బ్యాలెన్స్‌ చేస్తుంది. దీంతో పాటు యాంటీ వైరస్‌, బ్యాక్టీరియా కాబట్టి సూక్ష్మజీవులు నశిస్తాయి. గుల్లలు, మొటిమలు, నొప్పులు నశిస్తాయి. దీంతో పాటు వేపాకుతో మంచే కానీ ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు ఉండవు. ఏ చర్మానికైనా నప్పుతుంది. ముఖచర్మం చురుకుగా కనపడటంతో పాటు యూత్‌ఫుల్‌గా ఉంటుంది.

Updated Date - 2023-01-24T23:03:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising