ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eye Exercises : కళ్లకూ వ్యాయామాలు

ABN, First Publish Date - 2023-03-02T00:48:27+05:30

మన శరీరంలో కళ్లు ఒక ముఖ్యమైన భాగం. కానీ చాలా మంది వీటికి ప్రాధాన్యత ఇవ్వరు. జిమ్‌కు వెళ్లి ప్రతి రోజు వ్యాయామం చేసేవారు కూడా కళ్లకు సంబంధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మన శరీరంలో కళ్లు ఒక ముఖ్యమైన భాగం. కానీ చాలా మంది వీటికి ప్రాధాన్యత ఇవ్వరు. జిమ్‌కు వెళ్లి ప్రతి రోజు వ్యాయామం చేసేవారు కూడా కళ్లకు సంబంధించిన వ్యాయామాలను పట్టించుకోరు. అలాంటి కొన్ని కంటి వ్యాయామాలను ఇప్పుడు చూద్దాం..

పెన్సిల్‌ పుషప్స్‌

చేతిని పూర్తిగా చాచి ఒక పెన్సిల్‌ను పట్టుకోవాలి. ఆ పెన్సిల్‌ మొననే చూస్తూ ఉండాలి. అలా చూస్తూ పెన్సిల్‌ను ముక్కు దాకా తీసుకురావాలి. పెన్సిల్‌ను ముక్కు దగ్గరకు తీసుకువచ్చే సమయంలో దృష్టిని మరల్చకూడదు. ఇలా కనీసం పది సార్లు చేయాలి.

అరిచేతులతో...

రెండు కళ్లను అరిచేతులతో వీషేపులో మూయాలి. ఆ తర్వాత పై నుంచి కిందకు అరిచేతులను కదుపుతూ ఉండాలి. ఇలా కనీసం ఐదు సార్లు చేయాలి.

కళ్లు తిప్పటం...

ఒక చోట ప్రశాంతంగా కూర్చోవాలి. తలను నిటారుగా ఉంచాలి. తలను కదల్చకుండా కళ్లను ఎడమ వైపు నుంచి కుడివైపుకు..కుడివైపు నుంచి ఎడమవైపుకు తిప్పాలి. ఆ తర్వాత కళ్లను గుండ్రంగా గడియారం ముల్లు తిరిగినట్లు తిప్పాలి. ఇలా చేయటం వల్ల కళ్లకు మంచి విశ్రాంతి లభిస్తుంది.

20-20-20

చాలా మంది ఎక్కువ సేపు మానిటర్స్‌ ముందు కూర్చుని ఉంటారు. దీని వల్ల కంటిపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడిని తొలగించు కోవటానికి 20-20-20 రూల్‌ను వాడతారు. దీని ప్రకారం ఎవరైనా 20 నిమిషాలు మానిటర్‌ చూసిన తర్వాత దృష్టిని 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుపై 20 సెకన్లు కేంద్రీకరించాలి. ఇలా చేయటం వల్ల కంటికి చాలా విశ్రాంతి లభిస్తుంది.

Updated Date - 2023-03-02T03:41:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!