Dress sense : ముద్దుగా.... ముచ్చటగా...
ABN, First Publish Date - 2023-09-20T03:24:20+05:30
కురచగా ఉండే అమ్మాయిలు దుస్తుల ఎంపికలో తెలివిగా వ్యవహరించాలి. అందుకోసం ఈ డ్రెస్సింగ్ టిప్స్ పాటించాలి.
కురచగా ఉండే అమ్మాయిలు దుస్తుల ఎంపికలో తెలివిగా వ్యవహరించాలి. అందుకోసం ఈ డ్రెస్సింగ్ టిప్స్ పాటించాలి.
ప్రింట్లు: ప్రింట్లు కలిగి ఉండే దుస్తులు వేసుకోడానికి భయపడవలసిన అవసరం లేదు. అయితే చిన్నపాటి మోటిఫ్స్ ఉన్న డ్రస్‌లు ఎంచుకోవాలి.
ఆర్మ్‌హోల్స్: టాప్స్, డ్రెసెస్ కోసం షాపింగ్ చేసేటప్పుడు ఆర్మ్‌హోల్స్‌లో నుంచి లోపలి బ్రా కనిపించకుండా ఉండేలా చూసుకోవాలి.
షోల్డర్ ప్లేస్‌మెంట్: స్లీవ్స్ పైభాగాలు, భుజాలు దిగిపోకుండా, కరెక్టుగా భుజం ఎముక మీద కూర్చుని ఉండేలా చూసుకోవాలి.
నెక్‌లైన్: వి నెక్, స్కూప్ నెక్స్ పొడవుగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి ఆ రకం దుస్తులే ఎంచుకోవాలి.
వెయిస్ట్ లైన్: నడుము దగ్గర అతికించినట్టుండే టాప్స్, డ్రస్సులు ఎంచుకునేటప్పుడు అవి సరిగ్గా వెయిస్ట్ లైన్ దగ్గరే జాయింట్ అయి ఉండేలా చూసుకోవాలి. ఏమాత్రం పైకి, కిందకూ ఉండకూడదు.
స్కర్ట్ హెమ్: కురచగా ఉండే అమ్మాయిలు మోకాలికి ఎగువన హెమ్ లైన్ ఉండే స్కర్ట్‌లు వేసుకోవాలి.
షేప్: బాక్స్‌లా కనిపించేలా చేసే దుస్తులు, అదనపు ఫ్యాబ్రిక్ కలిగి ఉన్నవీ, లేయర్ రకానికి చెందినవీ వేసుకోకూడదు.
Updated Date - 2023-09-20T03:24:44+05:30 IST