ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cute friendship : క్యూట్‌ స్నేహం!

ABN, First Publish Date - 2023-08-08T23:34:43+05:30

పిల్లలు తమ చుట్టుపక్కల ఉన్న వాతావరణం నుంచి ఎంతో నేర్చుకుంటారు. తమ తోటి వారితో కలిసిపోయే గుణం ఉంటే ఇంకా మంచిది. ఇలాంటి స్వభావాన్ని చిన్నప్పటి నుంచి పెంచాలంటున్నారు మానసిక నిపుణులు.

  • పిల్లలు తమ చుట్టుపక్కల ఉన్న వాతావరణం నుంచి ఎంతో నేర్చుకుంటారు. తమ తోటి వారితో కలిసిపోయే గుణం ఉంటే ఇంకా మంచిది. ఇలాంటి స్వభావాన్ని చిన్నప్పటి నుంచి పెంచాలంటున్నారు మానసిక నిపుణులు.

  • పిల్లలు తరచుగా కలుసుకుంటూ ఉంటే వారి మధ్య బంధం పెరుగుతుంది. తమ తోటివారిపై ప్రేమ పెరుగుతుంది. దీనికి తల్లితండ్రులు కూడా తమ వంతు పాత్ర పోషించాలి. పిల్లలు తమ తల్లితండ్రులను చూసి చాలా నేర్చుకుంటూ ఉంటారు. అందువల్ల తల్లితండ్రులు ఇరుగుపొరుగు వారితో కలిసి ఉంటే- పిల్లలు తమస్నేహితులతో కలిసిపోతారు.

  • స్నేహం వల్ల కలిగే లాభాలను పిల్లలకు చిన్నప్పటి నుంచి వివరించాలి. జీవితంలో మంచి స్నేహితుల అవసరాన్ని వారికి వివరించాలి. సాధారణంగా చిన్ననాటి స్నేహం పెద్ద అయిన తర్వాత కూడా బలంగానే ఉంటుంది. అలాంటి స్నేహాలకు పునాదిని వేయాల్సిన బాధ్యత తల్లితండ్రులదే! అదే సమయంలో వారిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి. వారి మధ్య ఏవైనా తగాదాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించాలి. అవసరమైతే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో కూడా చెప్పాలి.

  • పిల్లల్లో పోటీతత్వం చాలా మంచిది. కానీ అదే సమయంలో పోటీతత్వం ఎక్కువ అయిపోయినా రకరకాల సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల జీవితంలో గెలుపోటములు సాధారణమనే విషయాన్ని వారికి తెలియచెబుతూ ఉండాలి

  • ఏ ఇద్దరు పిల్లలు ఒక మాదిరిగా ఉండరు. అందువల్ల పిల్లలను ఎప్పుడూ పోల్చకూడదు. ఇదే విధంగా కొందరు తల్లితండ్రులు తమ పిల్లలను ఇతరుల ముందు అగౌరవపరుస్తూ ఉంటారు. పిల్లలు ఇలాంటి విషయాలను మర్చిపోతారనే అభిప్రాయంతో ఉంటారు. కానీ ఇటీవల మిషిగాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో - పిల్లలు ఇలాంటి విషయాలను చాలా కాలం గుర్తుపెట్టుకుంటారని.. దాని ప్రభావం వారి భవిష్యత్తుపై పడుతుందని తేలింది.

  • కొందరు తల్లితండ్రులు వారి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించటానికి ఇతరుల ముందు పొగుడుతూ ఉంటారు. వారు అతి సాధారణమైన పని చేసినా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. దీని వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగకపోగా- ఆదుర్దా, ఆందోళన వంటి లక్షణాలు పెరుగుతాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి కొందరిలో- తాము ఇతరుల కన్నా ఎక్కువమనే భావన బలంగా పాతుకుపోతుందని పేర్కొంటున్నారు.

Updated Date - 2023-08-08T23:34:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising