ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Color effects: రంగుల ప్రభావాలు

ABN, First Publish Date - 2023-02-28T02:53:59+05:30

మన చుట్టూ ఉన్న పరిసరాల్లోని రంగులు మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తాయని మీకు తెలుసా? రంగులు మానసిక భావనలను ప్రభావితం చేసి భావోద్వేగాలకు లోను చేస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మన చుట్టూ ఉన్న పరిసరాల్లోని రంగులు మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తాయని మీకు తెలుసా? రంగులు మానసిక భావనలను ప్రభావితం చేసి భావోద్వేగాలకు లోను చేస్తాయి. ఇంటి గోడల రంగుల మొదలు, కర్టెన్ల రంగుల వరకూ మన పరిసరాల్లోని రంగులు మన మీద చూపించే ప్రభావాలను తెలుసుకోవడం అవసరం.

తెలుపు:

రంగు శక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తుల పనితీరును పెంచుతుంది. ఫలితంగా శ్వాసక్రియ మెరుగై విచారం, కుంగుబాటు లాంటి ఇబ్బందులు తొలగిపోతాయి.

నలుపు:

శక్తితో పాటు మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలు పెరుగుతాయి.

ఎరుపు:

శరీరాన్ని వెచ్చబరుస్తుంది. గుండె వేగాన్ని, మెదడు పనితీరు, శ్వాసక్రియలను పెంచుతుంది. ఎరుపు రంగులతో కూడిన గదిలో ఉన్నప్పుడు ఉత్సుకత, శక్తి కూడా పెరుగుతాయి. అయితే అధిక రక్తపోటు, హైపర్‌టెన్షన్‌ సమస్యలున్న వాళ్లు ఈ రంగుకు దూరంగా ఉండాలి.

నారింజ:

ఫిజికల్‌ యాక్టివిటీని ప్రేరేపిస్తుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగై, ఎనర్జీ లెవెల్స్‌ పెరుగుతాయి. నారింజ రంగు పెయింట్‌ వేసిన గది వ్యాయామాలకు అనుకూలమైనది.

పసుపు:

జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తపోటు, పల్స్‌ రేటు పెరుగుతాయి. ఏకాగ్రతను పెంచడం కోసం క్లాసురూముల్లో ఈ రంగును ఎక్కువగా వాడుతూ ఉంటారు.

నీలం:

మానసిక స్వాంతన దక్కుతుంది. రక్తపోటును, గుండె వేగాన్ని తగ్గించి, శ్వాసక్రియను క్రమబద్ధం చేస్తుంది.

వంకాయ రంగు:

డిస్‌ప్లేసియా, వెన్ను నొప్పి లేదా స్కోలియోసిస్‌ సమస్యలు కొంత వరకూ అదుపులోకి వస్తాయి.

Updated Date - 2023-02-28T02:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!