ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chicken Recipes: చవులూరించే చికెన్‌ వంటకాలు

ABN, First Publish Date - 2023-09-08T23:46:55+05:30

నాన్‌వెజ్‌ అంటే ఎవరికైనా చికెన్‌ ముందుగా గుర్తొస్తుంది. అందరికీ అందుబాటు ధరలో ఉండే చికెన్‌తో రొటీన్‌గా పులుసు, ఫ్రై చేసుకోకుండా.. కాస్త కొత్తగా ప్రయత్నించండి. హైదరాబాద్‌ గ్రీన్‌ చికెన్‌, చికెన్‌ చెట్టినాడ్‌, కరివేపాకు కోడి వేపుడు వంటకాల్ని రుచిగా వండుకోండిలా...

నాన్‌వెజ్‌ అంటే ఎవరికైనా చికెన్‌ ముందుగా గుర్తొస్తుంది. అందరికీ అందుబాటు ధరలో ఉండే చికెన్‌తో రొటీన్‌గా పులుసు, ఫ్రై చేసుకోకుండా.. కాస్త కొత్తగా ప్రయత్నించండి. హైదరాబాద్‌ గ్రీన్‌ చికెన్‌, చికెన్‌ చెట్టినాడ్‌, కరివేపాకు కోడి వేపుడు వంటకాల్ని రుచిగా వండుకోండిలా...

హైదరాబాద్‌ గ్రీన్‌ చికెన్‌

కావాల్సిన పదార్థాలు:

చికెన్‌- 600 గ్రాములు, నూనె- 3 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి- 2 టేబుల్‌ స్పూన్లు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌- 1 టేబుల్‌ స్పూన్‌, ఉప్పు- రుచికి తగినంత, జీలకర్ర పొడి- టీస్పూన్‌, మిరియాల పొడి- అర టీస్పూన్‌, ధనియాల పొడి- టీస్పూన్‌, యాలకుల పొడి- కొద్దిగా, తాజా నిమ్మకాయ రసం- అర టీస్పూన్‌, జీడిపప్పులు- 12, పిస్తా పప్పు- 12, బాదం- 12, యాలకులు-10, లవంగాలు-7, దాల్చినచెక్కలు- 2 (చిన్నవి) సాజీరా- ఒకటిన్న టీస్పూన్‌, కొబ్బరి పొడి- ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, పెరుగు- కప్పు, పుదీనా- కప్పు, కొత్తిమీర- అరకప్పు, పచ్చి మిర్చి-8, మీడియమ్‌ సైజ్‌ ఉల్లిపాయలు- 2 (తరిగినవి)

తయారీ విధానం:

ఒక బౌల్‌లో చికెన్‌ వేసి అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, సరిపడ ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత అందులోకి జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, యాలకుల పొడి వేసిన తర్వాత మెల్లగా నిమ్మకాయ రసం అన్నివైపులా కొద్ది కొద్దిగా వేశాక మిశ్రమాన్ని కలపాలి. చికెన్‌ ముక్కలకు ఈ ఫ్లేవర్స్‌ పట్టేట్లు మిశ్రమాన్ని కలపి పక్కన ఉంచుకోవాలి.

ఒక ప్యాన్‌మీద జీడిపప్పులు, పిస్తాలు, బాదం వేసి రెండు నిముషాలపాటు వేయించిన తర్వాత మూడు లవంగాలు, నాలుగు యాలకులు, దాల్చిన చెక్క, ముప్పావు టీస్పూన్‌ సాజీరా వేసిన తర్వాత లోఫ్లేమ్‌లో ఉంచి కొబ్బరి పొడి వేయాలి. కొబ్బరి పొడి రంగు మారేంత వరకూ వేయించిన తర్వాత చల్లబర్చాలి. ఈ మిశ్రమాన్ని జార్‌లో వేసిన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసిన తర్వాత పెరుగు వేసి సరిపడ నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చికెన్‌లోకి వేసుకోవాలి. చికెన్‌ ముక్కలను పట్టేట్లు ఈ పేస్ట్‌ను బాగా కలపాలి. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి.

ప్యాన్‌మీద నెయ్యి వేశాక నూనె వేసి లోఫ్లేమ్‌లో వేడి చేయాలి. కాస్త వేడయ్యాక ఆరు యాలకులు, నాలుగు లవంగాలు, ముప్పావు టీస్పూన్‌ సాజీరా వేసి నిముషం పాటు వేయించాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేంత వరకూ వేయించాలి. చివరగా మారినేట్‌ చేసుకున్న చికెన్‌ను వేసి బాగా కలపాలి. నాలుగు నిముషాల తర్వాత మీడియమ్‌ ఫ్లేమ్‌లో ఉంచి ప్యాన్‌ మూత పెట్టాలి. ప్రతి ఐదు నిముషాలకు చికెన్‌ను గరిటెతో కదుపుతూ ఉండాలి. నూనె బాగా పైకి తేలేంత వరకూ ఉండాలి. ఇలా చికెన్‌ ఉడకటానికి కనీసం అరగంట సమయం పడుతుంది. ముక్క మెత్తగా ఉడకిందా లేదా అని చూసుకుని దింపేసుకోవాలి. గ్రీన్‌ చికెన్‌ రెడీ. దీన్ని అన్నంలో, చపాతితో తినొచ్చు. ఎంతో రుచికరంగా ఉంటుంది.

చికెన్‌ చెట్టినాడ్‌

కావాల్సిన పదార్థాలు:

కర్రీ కట్‌ చికెన్‌- 500 గ్రాములు, ఉప్పు- తగినంత, పసుపు- అర టీస్పూన్‌, నిమ్మరసం- టేబుల్‌ స్పూన్‌, నువ్వుల నూనె- 3 టేబుల్‌ స్పూన్లు, ధనియాలు- 3 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర- టీస్పూన్‌, సోంపు- టీస్పూన్‌, మిరియాలు- టీస్పూన్‌, యాలకులు- 3, నల్లటి యాలకులు-2, స్టార్‌ సోంపు-1, దాల్చిన చెక్క- చిటికెన వేలంత, జాజికాయ-1, బిర్యానీ ఆకు-1, ఎండిన మిరపకాయలు- 3, బ్లాక్‌ స్టోన్‌ ఫ్లవర్‌-2, కొబ్బరి పొడి- పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు- 10, అల్లం ముక్క- 1 (సన్నగా తరగాలి), చింతపండు పేస్ట్‌- ఒకటిన్నర టీస్పూన్‌, మెంతులు- అరటీస్పూన్‌, ఉల్లిపాయ- 1 (మీడియం సైజ్‌), కరివేపాకులు- 5

తయారీ విధానం:

బౌల్‌లో చికెన్‌ వేసిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలపాలి. ఈ చికెన్‌ను పక్కన ఉంచుకోవాలి.

ప్యాన్‌లో స్పూన్‌ నువ్వుల నూనె ధనియాలు, జీలకర్ర, సోంపు వేసిన తర్వాత గరిటెతో కదపాలి. మీడియమ్‌ ఫ్లేమ్‌లో ఉంచిన తర్వాత మిరియాలు, లవంగాలు, యాలకులు, నల్లటి యాలకులు, స్టార్‌ సోంపు, దాల్చిన చెక్క వేసిన తర్వాత కలపాలి. ఆ తర్వాత జాజికాయ, బిర్యానీ ఆకు, మిరపకాయలు, బ్లాక్‌ స్టోన్‌ ఫ్లవర్‌ వేసి గరిటెతో కదపాలి. ఈ వేయించిన మిశ్రమాన్ని ప్లేట్‌లో వేసి చల్లారబర్చాలి.

ఇపుడు అదే ప్యాన్‌లో కొబ్బరి పొడి వేసి లోఫ్లేమ్‌లో రంగు మారేంత వరకూ వేయించాలి. ఆ తర్వాత చల్లార్చిన మసాలా దినుసుల మిశ్రమంతో సహా కొబ్బరి పొడి, అల్లం, వెల్లుల్లి ముక్కలు, చింతపండు పేస్టు, మెంతులను జార్‌లో వేసి మిక్సీ పట్టాలి. ప్యాన్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకులు వేశాక గరిటెతో కదిపిన తర్వాత చికెన్‌ మిశ్రమాన్ని వేయాలి. చికెన్‌ కాస్త దోరగా కాలినట్లు రంగు మారిన తర్వాత మసాలా మిశ్రమాన్ని వేయాలి. దీన్ని మిక్స్‌ చేసిన తర్వాత మూడు కప్పులు నీళ్లు పోసి మీడియమ్‌ ఫ్లేమ్‌లో ఉంచి ప్యాన్‌ మూత పెట్టి ఉడికించాలి. నీళ్లు తగ్గిపోయి చక్కటి గ్రేవీలా కనపడేదాకా మధ్యలో గరిటెతో కదుపుతూ కుక్‌ చేసుకోవాలి. చికెన్‌ ముక్క మెత్తగా ఉడికినట్లు అయితే చెట్టినాడ్‌ చికెన్‌ రెడీ అయినట్లే. దీన్ని చపాతీలో లేదా అన్నంతో తినాలి.

కరివేపాకు కోడి వేపుడు

కావాల్సిన పదార్థాలు:

తాజా చికెన్‌- 1 కేజీ (చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), ఉప్పు- అర టీస్పూన్‌, పసుపు- కొద్దిగా, కరివేపాకు- రెండు గుప్పెళ్లు, నూనె- 10 టేబుల్‌ స్పూన్లు, యాలకులు- 8, లవంగాలు- 6, దాల్చిన చెక్క- 1 (పెద్దది), సోంపు- టేబుల్‌ స్పూన్‌, జీలకర్ర- రెండున్నర టేబుల్‌ స్పూన్లు, నల్లమిరియాలు- 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి- ఒకటిన్నర టీస్పూన్‌, సన్నటి అల్లం ముక్కలు- టేబుల్‌ స్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు- 16 (సన్నగా తరగాలి), ఉల్లిపాయ పేస్ట్‌- టేబుల్‌ స్పూన్‌, పచ్చిమిర్చి- 8 (సన్నగా తరగాలి), జీడిపప్పు- 10,

తయారీ విధానం:

శుభ్రం చేసిన చికెన్‌ ముక్కలను కుక్కర్‌లో వేసి అందులోకి ఉప్పు, పసుపు వేసి కలపాలి. ముక్కలను ఉప్పు, పసుపు పట్టిన తర్వాత కప్పున్నర నీళ్లు వేసిన తర్వాత కుక్కర్‌ మూత ఉంచి హైఫ్లేమ్‌లో కుక్‌ చేయాలి. చికెన్‌ ముక్క ఉడికిన తర్వాత మిగిలిన నీళ్లను కప్పులో పోసి.. ఆ చికెన్‌ను బౌల్‌లో ఉంచుకోవాలి.

స్టవ్‌ ఆన్‌ చేసి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి.. ప్యాన్‌లో యాలకులు, లవంగాలు వేశాక దాల్చిన చెక్క తుంచి వేయాలి. ఆ తర్వాత సోంపు, జీలకర్ర, నల్ల మిరియాలు వేశాక మూడు నిముషాల పాటు గరిటెతో కదుపుతూ వేయించాక కరివేపాకు వేసి లోఫ్లేమ్‌లో ఉంచాలి. నాలుగైదు నిముషాల పాటు గరిటెతో కరివేపాకును కదుపుతూ ఉంటే రంగు మారిపోతుంది. వెంటనే నెయ్యి వేసి నిముషం పాటు కలపాలి. ప్యాన్‌ మీద మూత ఉంచి నాలుగు నిముషాల పాటు ఉంచి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. ఈ కరివేపాకు మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి పొడి పొడిగా మిక్సీ పట్టాలి. దీన్ని ఒక బౌల్‌లో వేసుకుని పక్కన ఉంచుకోవాలి.

ప్యాన్‌లో నూనె వేసి అందులో జీడిపప్పు వేసి రెండు నిముషాలు వేయించాక అల్లం, వెల్లుల్లి ముక్కలను వేయాలి. జీడిపప్పు రంగు మారుతుంది. పచ్చిమిర్చి వేసి గరిటెతో బాగా కలపాలి. మంటను హైలో ఉంచి ఉల్లిపాయ పేస్ట్‌ వేసి కలుపుతూ తగినంత ఉప్పు వేసుకోవాలి. మూడు నిముషాల పాటు గరిటెతో కదిపాక చికెన్‌ వేసి మిశ్రమంతో కలిసేట్లు బాగా కలపాలి. ఆ తర్వాత పదిహేను నిముషాల పాటు కంటిన్యూగా ముక్కలను కదుపుతూ ఉండాలి. పక్కన ఉంచుకున్న చికెన్‌ నీళ్లను పోయాలి. కొద్దిగా కరివేపాకు పొడి వేసి కలపాలి. నీళ్లు ఆవిరి అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు పొడి వేసి కలపాలి. ఇలా కొద్ది కొద్దిగా కరివేపాకు పొడి వేసి కలుపుతుండాలి. కరివేపాకు పొడి చికెన్‌కు బాగా పడుతుంది. రుచి చెక్‌ చేసుకుని కాస్త కొత్తిమీరను గార్ని్‌షగా చల్లుకుని దింపేసుకోవాలి. కరివేపాకు కోడి వేపుడు రెడీ. దీన్ని అన్నంలోకి స్నాక్‌లా నంజుకుని తింటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2023-09-08T23:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising