ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Antacids : యాంటాసిడ్స్‌ వాడొచ్చా?

ABN, First Publish Date - 2023-02-07T02:46:28+05:30

ఏ రకమైన యాంటాసిడ్‌ అయినా పొట్టలోని ఆమ్లాన్ని స్థిరం చేయగలుగుతుందే తప్ప దాని ఉత్పత్తిని తగ్గించలేదు. ఆమ్లం ఉత్పత్తి కారణంగా తలెత్తే అల్సర్‌కైతే యాంటాసిడ్లను వాడినా ఫర్వాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ రకమైన యాంటాసిడ్‌ అయినా పొట్టలోని ఆమ్లాన్ని స్థిరం చేయగలుగుతుందే తప్ప దాని ఉత్పత్తిని తగ్గించలేదు. ఆమ్లం ఉత్పత్తి కారణంగా తలెత్తే అల్సర్‌కైతే యాంటాసిడ్లను వాడినా ఫర్వాలేదు. అల్సర్‌కు కారణం బ్యాక్టీరియా, క్యాన్సర్‌లు అయిన పక్షంలో యాంటాసిడ్‌లు వాడుతూపోతే సమస్య మరింత ముదిరి ప్రాణాలకే ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రకమైన అల్సరో తెలుసుకోకుండా తక్షణ ఉపశమనం కోసం యాంటాసిడ్లను వాడుతూ కూర్చోకూడదు. అల్సర్‌ లక్షణాలు అడపా దడపా అందరిలో ఏదో ఓ సందర్భంలో కనిపిస్తాయి. అయితే ఎప్పుడైనా భారీ భోజనం తిని అల్సర్‌ లక్షణాలు కనిపించినప్పుడు యాంటాసిడ్‌ వాడి ఉపశమనం పొందటం మంచిదే! అయితే ఆ అవసరం ఎంత తరచుగా వస్తుందో గమనించాలి.

ఒకవేళ వారంలో నాలుగైదు రోజులు అల్సర్‌ లక్షణాలు కనిపించినా, పదే పదే యాంటాసిడ్‌ వాడాల్సిన అవసరం పడుతున్నా ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. యాంటాసిడ్‌లకు దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. మెగ్నీసియం హైడ్రాక్సైడ్‌, అల్యూమినియం హైడ్రాక్సైడ్‌ అనే రెండు రకాల యాంటాసిడ్‌లలో వేర్వేరు సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తాయి. అల్యూమినియం హైడ్రాక్రైడ్‌ కలిగిన యాంటాసిడ్‌ వల్ల మలబద్ధకం, మెగ్నీసియం హైడ్రాక్సైడ్‌ కలిగిన యాంటాసిడ్‌ వల్ల డయేరియా వస్తుంది. మనంతట మనం యాంటాసిడ్‌లను ఎంపిక చేసుకుంటే ఈ దుష్ప్రభావాలను బలవంతంగా భరించాల్సి ఉంటుంది. అలాకాకుండా వైద్యుల పర్యవేక్షణలో వాడితే ఆ సైడ్‌ ఎఫెక్ట్స్‌ను వైద్యుల దృష్టికి తీసుకెళ్తాం కాబట్టి వైద్యులు వేరే మందులను లేదా కాంబినేషన్‌ డ్రగ్స్‌ను సూచిస్తారు.

Updated Date - 2023-02-07T02:46:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising