ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Beautiful life : బ్యూటిఫుల్‌ లైఫ్‌

ABN, First Publish Date - 2023-09-13T02:23:12+05:30

మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతాం? మనతో మనమే 24/7 సమయం గడుపుతాం! ఇలా పుట్టింది మొదలు చివరి వరకూ మనకు మనమే..

మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతాం?

మనతో మనమే 24/7 సమయం గడుపుతాం!

ఇలా పుట్టింది మొదలు చివరి వరకూ మనకు మనమే

సన్నిహితులం! కాబట్టి మన మీద, మన ఆనందాల మీద, అందుకు తోడ్పడే జీవన విధానం మీద దృష్టి పెట్టాలి!

ఆరోగ్యం: ఏ పని చేయాలన్నా అందుకు శరీరం సహకరించాలి, శక్తితో, చలాకీగా ఉండాలి. కాబట్టి శరీరం ఫ్లెక్సిబిలిటీ, చురుకుదనం పొందేలా వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేయాలి. వ్యాయామం చేయడానికి అడ్డుపడే బద్ధకాన్ని వదలించాలంటే ఆహారంలో చక్కెరకు గుడ్‌ బై చెప్పాలి. ఈ నియమం కచ్చితంగా పాటిస్తూ కనీసం వారంలో మూడు రోజులు అరగంట వ్యాయామం చేస్తూ, క్రమంగా ఆ సమయాన్ని పెంచాలి. క్రమేపీ వ్యాయామం తీవ్రతా పెంచాలి. నెల రోజుల్లో మీలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

ఆలోచనలు: మనసులో చెలరేగే ఆలోచనలే మన చేతుల్లో ప్రతిబింబిస్తాయు. బలం, బలహీనతలు ఆలోచనల రూపంలో మన మెదడులోనే ఉంటాయి. చేయగలగడం, చేయలేకపోవడం, భయం, బెరుకు లాంటివన్నీ మనం ప్రత్యక్షంగా చేతల్లో పెట్టనంత వరకే మనల్ని వెనకకు లాగగలుగుతాయి. ఆ ఆలోచనలను లెక్క చేయకుండా అడుగు ముందుకేస్తే అసాధ్యమైనది ఏదీ లేదనే నిజం అనుభవానికొస్తుంది.

ఆనందం: వయసు ఆనందానికి అడ్డంకి కాకూడదు. ఆనందం కొంతమందికి, కొంత వయసుకే పరిమితం కాదు. కాబట్టి ఆనందాన్ని పొందే మార్గాలను అన్వేషించి, ఆచరించాలి. ప్రయాణాలు, అభిరుచులు, ఏకాంతాలు, సంగీతం, పుస్తక పఠనం... ఇలా మీకు ఆనందం దక్కే మార్గాలను వెతకాలి.

Updated Date - 2023-09-13T02:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising