ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ashwanidat: క్రమశిక్షణే ఆయన కవచం

ABN, First Publish Date - 2023-05-27T03:29:47+05:30

ఎన్నో ఏళ్ల నటజీవితం... అదీ ఆషామాషీ కాదు. అందులోనే విభిన్నమైన పౌరాణిక, సాంఘిక కదాంశాలు. తెగువతో, ధైర్యంగా విలక్షణ పాత్రల పోషణ. పౌరాణికాలలో రాముడు, కృష్ణుడు ఒక ఎత్థైతే, నెగెటివ్‌ క్యారెక్టర్సుగా ధరించడానికే అందరూ భయపడే రావణాసురుడు, దుర్యోధనుడు పాత్రలను సైతం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్నో ఏళ్ల నటజీవితం... అదీ ఆషామాషీ కాదు. అందులోనే విభిన్నమైన పౌరాణిక, సాంఘిక కదాంశాలు. తెగువతో, ధైర్యంగా విలక్షణ పాత్రల పోషణ. పౌరాణికాలలో రాముడు, కృష్ణుడు ఒక ఎత్థైతే, నెగెటివ్‌ క్యారెక్టర్సుగా ధరించడానికే అందరూ భయపడే రావణాసురుడు, దుర్యోధనుడు పాత్రలను సైతం ప్రేక్షకజనరంజకంగా పోషించి కొత్త ఒరవడికి ప్రాణం పోసిన నటపుంగవుడు నందమూరి తారక రామారావు అన్నది తిరుగులేని చారిత్రకసత్యం. వరకట్న దురాచరాలు, ఉమ్మడి కుటుంబ బంధాల పరిమళాలు.... ఒకటీ రెండూ కాదు! సామాజిక విలువలకు, తాను చేపట్టిన చిత్రపరిశ్రమ ద్వారా ప్రయోగత్మక చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించి అఖిలాంధ్ర ప్రేక్షకుల నీరాజనాలను అందుకున్న నిలువెత్తు నట విశ్వ తేజో మూర్తిగా అయన మూర్తిభవించడం గతకాలపు తీపి గుర్తుగా నిలిచింది.

ఇటువంటి సాహసపేతమైన, కళాత్మక ప్రక్రియలను చేసినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఎన్‌. టి. అర్‌ అనే మూడక్షరాలు తెలుగు చిత్ర పరిశ్రమని శాసించి, భారత ఉప ఖండానికే తలమానికమై తేజరిల్లి, విరాజిల్లిందంటే అందుకు ముఖ్యమైన కారణం –అయన పాటించిన క్రమశిక్షణాయతమైన జీవనసరళి. అయన శిఖరమై మొనదేలి, ఆకాశాన్నే చుంభించే ఎత్తుకు ఎదిగీనా ఏ క్షణమూ ఆ నిశ్చల స్థిరత్వాన్ని కోల్పోలేదంటే –అందుకు కట్టుదిట్టమైన అయన క్రమశిక్షణే బలిష్టమైన పునాది అని అక్షరాలా విశ్వసిస్తాను.

ఏ రోజైనా బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్ర లేచి వ్యాయామం, అనంతరం స్నానాదులు ముగించుకొని దైవధ్యానం.... ఇదొక మార్పులేని తెల్లవారి పడికట్టు. ఆ వెంటనే కధాచర్చలు.... సరస్వతీ పుత్రులైన రచయితలతో సమావేశాలే ప్రభాతకాల ప్రక్రియ. తర్వాత మేకప్‌ వేసుకొని, అయన కోసం తిరుపతి నుంచి వచ్చి ఇంటి ముందు రెక్కలుకట్టుకుని వాలిన అభిమానుల కేరింతలు– కన్నుల పండుగలా ఉండేది ఆ దృశ్యం. అందరినీ పేరుపేరునా కుశలసమాచారాలను అడిగీ తెలుసుకుని, వాళ్ళని ఆనంద పరచి అప్పుడు స్టూడియోకి బయలుదేరేవారు. అభిమానులే లేకపోతే మనమెక్కడ బ్రదర్‌ అనేమాట అయన పెదవుల పైన పదే పదే దొర్లేది.

ఇంతా ముగీంచుకొని ఏడో గంటకల్లా కెమెరా ముందు గెటప్‌ తో సహా నిలబడేవారు. మహమహా అనుకున్నవారైనా, నా బోటి యువ నిర్మాతలైనా –షూటింగ్‌ కార్యక్రమాలు ఇబ్బంది పడకుండా, జీవితకాలమంతా అమలు చేసిన అద్వితీయ కధానాయకుడు నందమూరి తారక రామారావుగారని చెపుతుంటే మనసు పరవళ్లు తొక్కుతోంది. షూటింగ్‌ టైములో కూడా ఏనాడూ యువదర్శకుడైనా, అగ్రదర్శకుడైనా చెప్పిందే చేసి తన పరిధిలోనే తాను ప్రవర్తించిన పరమ నియమశీలి. దర్శకనిర్మాతలకు అయన ఆపాదించిన విలువ అది. స్వయంగా ఆయనే మహా దర్శకుడైనా ఏ దర్శకుడికీ ఏ సలహాలు, సూచనలు చెయ్యడమన్నది అయన నిఘంటువు లోనే లేనేలేదు. దర్శకుడి ఆలోచనల మేరకు నటించడమే వృత్తిపరంగా ప్రధమ కర్తవ్యంగా భావించిన వ్యక్తిత్వ పరిపూర్ణుడు అయన.

షూటింగ్‌ పూర్తయ్యాక సాయంత్రం మళ్ళీ అయన సినిమాల కధలు రాసుకోవడం, ఇతరుల కధలను చర్చించడం, అక్కడితో అయన దినచర్య పూర్తయ్యేది.

మళ్ళీ మరుసటి రోజు ఆ బ్రహ్మ ముహూర్త కాలం అయన కోసం ఎదురు చూేసది. ఆయనతో నా తొలి చిత్రం ఎదురులేని మనిషి సన్నాహాలు జరుగుతున్నపుడు – పైలాపచ్చిసు కుర్రాడిగా అయన పవిత్రమైన ప్రాంగణంలోకి అడుగు పెట్టిన క్షణం నుంచి అయన దినచర్యలో నేనూ ఒక ఆత్మీయమైన అంతర్భాగమైపోయాను. చూసి కొంత, అయన చెప్పగా మరికొంత –ఎన్‌. టి. అర్‌ అనే విశ్వవిద్యా లయం నుంచి నేర్చుకున్నాను. అంతా నా జీవితానికి ఏర్చి కూర్చుకున్నాను. అలవర్చుకున్నాను. అందంగా అమర్చుకున్నాను. ఆ జ్ఞాపకాలు, అనుభవాలను సగర్వాంగా పదిలంగా పదిలపరుచుకున్నాను. ఆనందంగా దాచుకున్నాను.

• అశ్వనిదత్‌ చలసాని (ప్రముఖ నిర్మాత)

Updated Date - 2023-05-27T03:29:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising