ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్రాడ్‌ లావాదేవీలకు యాపిల్‌ అడ్డుకట్ట

ABN, First Publish Date - 2023-05-20T03:33:42+05:30

యాపిల్‌ – రెండు బిలియన్‌ డాలర్లకు మించిన లావాదేవీలను నిరోధించింది. దాదాపు పదిహేడు లక్షల యాప్‌లు గూగుల్‌ యాప్‌స్టోర్‌ నిబంధనలకు అనుగుణంగా లేవు. ఫలితంగా ప్రైవసీ, భద్రత ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని సదరు చర్య తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాపిల్‌ – రెండు బిలియన్‌ డాలర్లకు మించిన లావాదేవీలను నిరోధించింది. దాదాపు పదిహేడు లక్షల యాప్‌లు గూగుల్‌ యాప్‌స్టోర్‌ నిబంధనలకు అనుగుణంగా లేవు. ఫలితంగా ప్రైవసీ, భద్రత ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని సదరు చర్య తీసుకుంది. 4,28,000 డెవలపర్లు, 282 మిలియన్ల మేర కస్టమర్‌ అకౌంట్లను మూసేసింది. 105 మిలియన్ల మంది అనుమానాస్పద డెవలపర్‌ ఎన్‌రోల్‌మెంట్స్‌ను నిరోధించింది. 57,000 మేరకు అనాథరైజ్డ్‌ మార్కెట్‌ప్లేస్‌ యాప్స్‌ను – సేఫ్టీ రిస్క్‌ పేరిట అడ్డుకుంది. నమ్మకం ఏమాత్రం కలిగించని యాప్స్‌ అలాగే న్యాయబద్ధం కాని స్టోర్‌ఫ్రంట్ల నుంచి యూజర్లను రక్షించగలిగింది. యురోపియన్‌ యూనియన్‌ చట్టాన్ని గౌరవించే క్రమంలో మూడో పార్టీ యాప్‌ స్టోర్స్‌కు అనుమతి ఇవ్వనుందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో యాపిల్‌ ఈ చర్యలు తీసుకుంది. తద్వారా సెక్యూరిటీ ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. అలాగే లక్ష యాప్‌లపై వచ్చిన ఫిర్యాదుల్లో 90 శాతం మేర 24 గంటల్లో రివ్యూ చేసింది. ప్రైవసీని ఉల్లంఘించాయని చెప్పి నలభై వేల యాప్స్‌ను, హిడెన్‌ ఫీచర్స్‌ ఉన్న 29,000 యాప్స్‌ను తిరస్కరించింది. పేమెంట్‌ టెక్నాలజీ వ్యవహారాల్లోనూ భద్రతపై యాపిల్‌ దృష్టిసారించింది. అలా రమారమి దొంగలించిన 39 లక్షల క్రెడిట్‌ కార్డుల నుంచి అనుచితంగా కొనుగోళ్ళను ఆపింది. 4.28 లక్షల మేర డెవలపర్‌ అకౌంట్లను తొలగించింది. మొత్తమ్మీద అక్రమ లావాదేవీలకు తనదైన చర్యలతో యాపిల్‌ అడ్డుకట్ట వేసింది.

Updated Date - 2023-05-20T03:33:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising