దశాబ్దాల తర్వాత వెలిగిన ఇల్లు
ABN, First Publish Date - 2023-06-29T05:18:14+05:30
కొన్ని జీవిత సంఘటనలు సినిమా సన్నివేశాలను తలపిస్తాయి. అలాంటి సంఘటనే జైపూర్‌కు చెందిన మహిళా ఐపిఎస్ ఆఫీసర్ అనుక్రితి శర్మ జీవితంలో చోటు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక వృద్ధురాలి ఇంటికి విద్యుత సౌకర్యాన్ని కల్పించి వార్తల్లోకెక్కిన శర్మ కథ ఇది.
కొన్ని జీవిత సంఘటనలు సినిమా సన్నివేశాలను తలపిస్తాయి. అలాంటి సంఘటనే జైపూర్‌కు చెందిన మహిళా ఐపిఎస్ ఆఫీసర్ అనుక్రితి శర్మ జీవితంలో చోటు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక వృద్ధురాలి ఇంటికి విద్యుత సౌకర్యాన్ని కల్పించి వార్తల్లోకెక్కిన శర్మ కథ ఇది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్‌హెహర్ నివాసి అయిన 70 ఏళ్ల నిరుపేద వృద్ధురాలు నూర్జహాన్ కొన్ని దశాబ్దాలుగా విద్యుత సదుపాయం లేకుండానే నివసిస్తోంది. కూతురికి పెళ్లి చేసి పంపించిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన నూర్జహాన్ కరెంటు లేని చీకటి ఇంట్లోని నివసిస్తూ ఉండిపోయింది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడం కోసం ఆ పెద్దావిడ, పోలీస్ చౌపల్‌ను ఆశ్రయించింది. ప్రజలకూ పోలీసులకు మధ్య దూరాలను కలిపే వారధిగా పోలీసులు క్రమం తప్పకుండా ‘పోలీస్ చౌపల్’ అనే సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాంటి ఒక సమావేశంలో నూర్జహాన్ తన దుస్థితిని వెల్లడించడంతో, బులంద్‌హెహర్ ఎస్పీగా పని చేస్తున్న అనుక్రితి శర్మ ఆలోచనలో పడింది. అన్ని దశాబ్దాల పాటు కరెంటు లేని ఇంట్లో నివసించిన ఆ పెద్దావిడ పరిస్థితిని చూసిన శర్మ మనసు కదిలిపోయింది.
జీవితాన్ని వెలిగించి...
వెంటనే విద్యుత కార్యాలయాన్ని సంప్రతించి, నూర్జహాన్ ఇంటికి విద్యుత వెలుసుబాగు కల్పించింది శర్మ. అంతేకాదు. పోలీసు నిధులతో ఆవిడ ఇంటికి లైటు, ఫ్యాన్ సదుపాయాలను కూడా కల్పించింది. తర్వాత నూర్జహాన్ ఇంటికి వెళ్లి స్వయంగా ఆవిడ చేత లైటును ఆన్ చేయించింది. అప్పుడు బల్బుతో పాటు నూర్జహాన్ ముఖం కూడా వెలిగిపోయింది. ఈ సంఘటనను ట్విటర్‌లో వీడియో ద్వారా షేర్ చేసిన శర్మ... ‘‘ఇది నా జీవితంలో స్వదేశ్ క్షణం. నూర్జహాన్ ఆంటీ ఇంటికి విద్యుత కనెక్షన్ తీసుకురావడం ద్వారా ఆవిడ జీవితంలో వెలుగును నింపగలిగాం. ఆవిడ ముఖం మీద విరిసిన చిరునవ్వు అంతులేని సంతృప్తిని కలిగించింది’’ అంటూ అనుక్రితి శర్మ జూన్ 26న నూర్జహాన్ ఇంటిని సందర్శించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పటివరకూ 7.8 లక్షల వ్యూలను సొంతం చేసుకోవడమే కాకుండా, ఎన్నో లైక్స్, కామెంట్స్‌ను కూడా పొందడం విశేషం.
పరుగే ధ్యానం
రాజస్థాన్, జైపూర్‌కు చెందిన అనుక్రితి శర్మ, యుపిఎ్‌ససి పరీక్షల్లో నెగ్గి, ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌లో ఎస్పీ విధుల్లో చేరింది. అయితే ఎంతో బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నప్పటికీ శర్మ తనకెంతో ఇష్టమైన బర్డ్ వాచింగ్, డాన్స్‌లను మాత్రం వదులుకోలేదు. ఇండియన్ పోలీస్ సర్వీసులో తాజాగా చేరిన శర్మ, ట్రైనింగ్‌లో ఒక సరికొత్త అభిరుచి ‘పరుగు’ పట్ల ఆసక్తిని పెంపొందించుకుంది. ఆవిడకు పూర్వపు అనుభవం లేకపోయినా, శిక్షణలో భాగంగా 16 కిలోమీటర్ల దూరం పరిగెత్తిన శర్మ, రన్నింగ్ అనేది తనకు మెడిటేషన్‌గా తోడ్పడుతున్నట్టు గ్రహించింది. ఎస్పీగా విధుల్లో చేరిన తర్వాత కూడా పరుగును ఆపకుండా మొదట ఒక కిలోమీటరు, తర్వాత 3, 5 కిలోమీటర్ల దూరాలు లక్ష్యంగా పరుగును సాఽధన చేయడంతో పాటు, 16 కిలోమీటర్ల హాఫ్ మ్యారథాన్ స్థాయికి ఎదిగింది. అలాగే ఒక కిలోమీటరు ఈత, 40 కిలోమీటర్ల సైక్లింగ్, 10 కిలోమీటర్ల పరుగుతో కూడిన ట్రయాథ్లాన్‌లో సైతం పాల్గొంది.
Updated Date - 2023-06-29T05:18:14+05:30 IST