ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Android phones : అటాక్‌కు అనువుగా ఆండ్రాయిడ్‌ ఫోన్లు!

ABN, First Publish Date - 2023-10-14T00:00:34+05:30

గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ ప్రపంచంలో పాపులర్‌ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌. రెండు వందల కోట్లకు మించి యాక్టివ్‌ యూజర్లు దీని సొంతం. అయితే 50కి మించి అటాక్స్‌కు

సీఈఆర్‌టీ-ఇన్ వెల్లడి

గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ ప్రపంచంలో పాపులర్‌ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌. రెండు వందల కోట్లకు మించి యాక్టివ్‌ యూజర్లు దీని సొంతం. అయితే 50కి మించి అటాక్స్‌కు అనువుగా(వల్నరబిలిటీస్‌) ఆండ్రాయిడ్‌(వి11, 12, 12ఎల్‌) ఉన్నాయని, తద్వారా సెన్సిటివ్‌ సమాచారాన్ని క్రిమినల్స్‌ తస్కరించే అవకాశం ఉందని తేలింది. సర్వీస్‌ తిరస్కరణకు కూడా అవకాశం ఉందని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టమ్‌(సీఈఆర్‌టీ-ఇన్‌) తెలిపింది. ఫ్రేమ్‌వర్క్‌లో లోపాలు అలాగే సిస్టమ్‌, గూగుల్‌ ప్లే సిస్టమ్‌ అప్డేట్స్‌, ఆర్మ్‌ కంపోనెంట్స్‌, మీడియాటెక్‌ కంపోనెంట్స్‌, యునిస్కోస్‌ కంపోనెంట్స్‌, క్వాల్కామ్‌ కంపోనెంట్స్‌, క్వాల్కామ్‌ క్లోజ్డ్‌-సోర్స్‌ కంపోనెంట్స్‌లో ఉన్న పొరపాట్లు దీనికి కారణమని తెలిపింది. సీవీఈ-2023-4863, సీవీఈ-2023-4211 యాక్టివ్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌లో ఉన్నట్టు భావిస్తున్నారు. దీన్ని పురస్కరించుకుని గూగుల్‌ - అక్టోబర్‌ నెల అప్టేట్‌కు తోడు సెక్యూరిటీ ప్యాచ్‌ను కూడా విడుదల చేసింది. పలువురు స్మార్ట్‌ఫోన్‌ రూపకర్తలు వీటిని తమ ఫోన్లకు తీసుకురానున్నారు. లేటెస్ట్‌ సెక్యూరిటీ ఫర్మ్‌వేర్‌ వెర్షన్‌ను గూగుల్‌ విడుదల చేసిన వెంటనే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్లు దానిని అప్డేట్‌ చేసుకోవాలని కూడా సూచించింది. సైబర్‌ ప్రమాదాలను తప్పించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలంది. ఫేక్‌ వెబ్‌సైట్లు మొదలుకుని ఓటీపీ వరకు ఎదురవుతున్న మోసాలను గ్రహించి జాగ్రత్తగా మసలుకోవాలని కోరింది.

Updated Date - 2023-10-14T00:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising