ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Akshay's movie : ఆస్కార్‌ బరిలో అక్షయ్‌ సినిమా

ABN, First Publish Date - 2023-10-14T23:25:24+05:30

అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘మిషన్‌ రాణీగంజ్‌’ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ చిత్రాన్ని ఆస్కార్‌ కోసం పోటీలో నిలిపింది చిత్రబృందం. జనరల్‌

అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘మిషన్‌ రాణీగంజ్‌’ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ చిత్రాన్ని ఆస్కార్‌ కోసం పోటీలో నిలిపింది చిత్రబృందం. జనరల్‌ కేటగిరీలో ప్రైవేటు నామినేషన్‌ ద్వారా ఈ చిత్రాన్ని ఆస్కార్‌కు పంపుతున్నారు. టిను సురేశ్‌ దేశాయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. బాక్సాఫీసు పరంగా సంతృప్తికరమైన ఫలితం రానప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకొంది. రాణీగంజ్‌లోని కోల్‌ ఫీల్డ్‌లో 65మంది మైనర్లను రక్షించిన కమాండో జశ్వంత్‌ సింగ్‌ గిల్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈయేడాది ఆస్కార్‌ అఫీషియల్‌ ఎంట్రీ కోసం ‘మిషన్‌ రాణీ గంజ్‌’ కూడా పోటీ పడింది. అయితే ఆ అవకాశం మలయాళ చిత్రం ‘2018’కి దక్కింది. దాంతో... ప్రెవేటు ఎంట్రీగా ‘మిషన్‌ రాణీగంజ్‌’ని ఆస్కార్‌కి పంపుతున్నారు. గతేడాది కూడా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ఇలానే ప్రైవేటు ఎంట్రీగా వెళ్లి ఆస్కార్‌ పట్టుకొచ్చిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-10-14T23:25:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising