ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heroine Srilila : బాలీవుడ్‌ నుంచి పిలుపు?

ABN, First Publish Date - 2023-08-06T00:33:51+05:30

‘పెళ్లి సందడి’తో పరిచయమైన కథానాయిక శ్రీలీల. ఒక్క సినిమాతోనే వంద చిత్రాల మైలేజీ దక్కించుకొంది. చక చక ఎదిగింది. ఇప్పుడు స్టార్‌ హీరోల సరసన నటిస్తోంది. తెలుగులో అత్యంత బిజీగా

‘పెళ్లి సందడి’తో పరిచయమైన కథానాయిక శ్రీలీల. ఒక్క సినిమాతోనే వంద చిత్రాల మైలేజీ దక్కించుకొంది. చక చక ఎదిగింది. ఇప్పుడు స్టార్‌ హీరోల సరసన నటిస్తోంది. తెలుగులో అత్యంత బిజీగా ఉన్న కథానాయిక ఎవరంటే శ్రీలీల పేరే చెప్పాలి ఎవరైనా. ఒక్కో సినిమాకీ కోటిన్నర పారితోషికం అందుకొంటోంది. ‘పుష్ప 2’లో ఐటెమ్‌ గీతంలో నర్తించే అవకాశం అందుకొందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై అటు చిత్రబృందం కానీ, ఇటు శ్రీలీలగానీ అధికారికంగా స్పందించలేదు.

తాజా సమాచారం ఏమింటంటే.. శ్రీలీలకు ఇప్పుడు బాలీవుడ్‌ నుంచి ఆఫర్‌ వచ్చిందట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించే భారీ చిత్రంలో కథానాయికగా శ్రీలీలని ఎంచుకొన్నారని తెలుస్తోంది. రణబీర్‌ కపూర్‌ కథానాయకుడిగా నటించే అవకాశం కనిపిస్తోంది. అయితే... ప్రస్తుతం శ్రీలీల కాల్షీట్లు ఖాళీగా లేవు. ఈ యేడాదంతా బిజీనే. తెలుగు సినిమాల్ని పక్కన పెట్టి బాలీవుడ్‌ ప్రాజెక్టు ఒప్పుకోవాలి. మరి.. శ్రీలీలకు అది సాధ్యమయ్యే పనేనా?

Updated Date - 2023-08-06T00:33:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising