ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Khushboo tweet : మోదీ అంటే అవినీతే

ABN, First Publish Date - 2023-03-26T01:03:30+05:30

‘మోదీ’ ఇంటి పేరును కించ పరిచారంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌కి రెండేళ్ల జైలు శిక్ష పడడం, లోక్‌సభ సభ్యత్వం రద్దయిన నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

201నాటి ఖుష్బూ ట్వీట్‌ వైరల్‌..

మరి ఆమె మీద కేసు పెడతారా?

కాంగ్రెస్‌ మద్దతుదారుల నిలదీత

బెంగళూరు, మార్చి25: ‘మోదీ’ ఇంటి పేరును కించ పరిచారంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌కి రెండేళ్ల జైలు శిక్ష పడడం, లోక్‌సభ సభ్యత్వం రద్దయిన నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ గతంలో చేసిన ఓ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. 2018లో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆమె ఈ ట్వీట్‌ చేశారు. అదేమిటంటే...‘‘ఇక్కడ మోదీ. అక్కడ మోదీ. ఎక్కడ చూసినా మోదీ. కానీ ఇదేంటి? ప్రతి మోదీకి ముందు అవినీతి అనేది ఇంటిపేరుగా ఉంది. మోదీ అంటే అవినీతి. మోదీ అంటే అర్థం అవినీతి అని మారుద్దాం. ఇది బాగా సరిపోతుంది. నీరవ్‌, లలిత్‌, నమో=అవినీతి’’అని ఆమె పేర్కొన్నారు. ‘‘మోదీ’’ లపై రాహుల్‌ 2019 ఎన్నికల ప్రచారంలో మాట్లాడగా.. అంతకు ఏడాది ముందే ఖుష్బూ ట్వీట్‌ చేశారు. దాన్ని ఇప్పటికీ తొలగించలేదు. ఖుష్బూ 2020లో బీజేపీలో చేరారు. తాజాగా రాహుల్‌ ఉదంతం నేపథ్యంలో కాంగ్రెస్‌ మద్దతుదారులు ఖుష్బూ ట్వీట్‌ను గుర్తుచేస్తూ బీజేపీని ప్రశ్నిస్తున్నారు.ఆమె మీద కూడా చర్యలు తీసుకుంటారా? అని నిలదీస్తున్నారు. దీనిపై ఖుష్బూ స్పందించారు. అప్పట్లో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా ఉన్న తాను తమ నాయకుడి భాషనే మాట్లాడినట్లు వివరణ ఇచ్చారు. మోదీలపై ట్వీట్‌ను తొలగించబోనని కూడా స్పష్టం చేశారు.

Updated Date - 2023-03-26T01:03:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising