ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Arvind Kejriwal: ఇండియా కూటమి సమావేశానికి హాజరుపై సీఎం క్లారిటీ

ABN, First Publish Date - 2023-08-21T17:17:56+05:30

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పడిన ఇండియా కూటమి మూడో సమావేశం ముంబై జరుగనున్న నేపథ్యంలో ఆమె ఆద్మీ పార్టీ వైఖరిపై ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం స్పష్టత ఇచ్చారు. ముంబై సమావేశానికి తాము వెళ్తామని చెప్పారు.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పడిన I.N.D.I.A. కూటమి మూడో సమావేశం ముంబై (Mumbai)లో జరుగనున్న నేపథ్యంలో ఆమె ఆద్మీ పార్టీ (AAP) వైఖరిపై ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సోమవారంనాడు స్పష్టత ఇచ్చారు. ముంబై సమావేశానికి తాము వెళ్తామని, కూటమి వ్యూహం ఏమిటనే దానిపై ఆ తర్వాత తెలియజేస్తామని చెప్పారు. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాల్లో విజయం కోసం సిద్ధంగా ఉండాలని పార్టీ ఢిల్లీ యూనిట్‌కు కాంగ్రెస్ ఇటీవల పిలుపునివ్వడంతో ఆ పార్టీ నేతలు, ఆప్ నేతల మధ్య మాటల యుద్ధం చేటుచేసుంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో ముంబైలో ఇండియా కూటమి సమావేశం జరుగనుంది.


అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ర్యాలీలో రాష్ట్రాన్ని రెండు పార్టీలు (బీజేపీ, కాంగ్రెస్) గత 75 ఏళ్లుగా పాలిస్తున్నాయని, ఏ పార్టీ కూడా రాష్ట్రానికి కరెంటు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ''మీకు పవర్ (విద్యుత్) సప్లయ్ కావాడంలో ఆప్‌కు ఓటేయండి. పవర్ అక్కర్లేదనుకుంటే ఆ రెండు పార్టీలకే వేయండి'' అని అన్నారు. దీనిపై కూడా కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ వర్గాల విమర్శలు గుప్పించాయి.


మూడో సమావేశం

ఇండియా కూటమి మూడో సమావేశం ముంబైలో ఈ నెలాఖరులో జరగనుంది. నేషనల్ క్యాపిటల్ బిల్లుకు మద్దతిచ్చే విషయంలో కాంగ్రెస్ ఏటూ తేల్చకపోవడంతో బీహార్‌లో జరిగిన తొలి ఇండియా కూటమి సమావేశానికి 'ఆప్' దూరంగా ఉంది. అయితే, ఆ తర్వాత ఆర్డినెన్స్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో బెంగళూరులో జరిగిన ఇండియా కూటమి రెండో సమావేశంలో ఆప్ పాల్గొంది. ఇప్పుడు ముంబై సమావేశానికి కూడా సిద్ధమవుతోంది.

Updated Date - 2023-08-21T17:17:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising