మసీదులు కూల్చివేసి ఆలయాలు నిర్మిస్తాం
ABN, First Publish Date - 2023-06-26T01:00:30+05:30
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వరప్ప మరో వివాదానికి ఆజ్యం పోశారు. మొఘలులు దేవాలయాలను కూల్చివేసి నిర్మించిన మసీదులు అన్నింటినీ ధ్వంసం చేస్తామని, వాటి స్థానంలో మళ్లీ గుడులను నిర్మిస్తామని స్పష్టం చేశారు.....
ముస్లింలు లేకుంటే కాంగ్రెస్ అంతరించేది
కర్ణాటక బీజేపీ నేత ఈశ్వరప్ప వ్యాఖ్యలు
బెంగళూరు, జూన్ 25(ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వరప్ప మరో వివాదానికి ఆజ్యం పోశారు. మొఘలులు దేవాలయాలను కూల్చివేసి నిర్మించిన మసీదులు అన్నింటినీ ధ్వంసం చేస్తామని, వాటి స్థానంలో మళ్లీ గుడులను నిర్మిస్తామని స్పష్టం చేశారు. హావేరిలో శనివారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హిందూమతాన్ని ద్వేషిస్తోందని, ముస్లింలు లేకుంటే ఆ పార్టీ అంతరించిపోయేదని పేర్కొన్నారు. ముస్లింల కారణంగానే కర్ణాటకలో కాంగ్రెస్ ఇప్పటికీ ఉనికిలో ఉందని వ్యాఖ్యానించారు. శివమొగ్గ జిల్లాకు చెందిన ఈశ్వరప్ప సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.
Updated Date - 2023-06-26T01:00:30+05:30 IST