భారత్‌లో మతస్వేచ్ఛకు విఘాతం
ABN, First Publish Date - 2023-09-22T02:43:38+05:30
భారత్‌లో మత, మైనార్టీల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, క్రమేణా ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తోందని ఐక్యరాజ్య సమితి మైనార్టీ వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధి ఫెర్నాండ్ డి వెరెన్నెస్ ఆందోళన
అమెరికా కమిషన్‌కు ఐరాస ప్రతినిధి వెల్లడి
వాషింగ్టన్, సెప్టెంబరు 21: భారత్‌లో మత, మైనార్టీల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, క్రమేణా ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తోందని ఐక్యరాజ్య సమితి మైనార్టీ వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధి ఫెర్నాండ్ డి వెరెన్నెస్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (యూఎ్‌ససీఐఆర్‌ఎ్‌ఫ)కు ఈ విషయం తెలిపారు. భారత్‌లోని పరిస్థితి ‘భారీగా, స్థిరంగా, ప్రమాదకరంగా’ ఉందని మూడు పదాల్లో అభివర్ణించారు. భారత్‌లో మత స్వేచ్ఛ అంశంపై బుధవారం విచారణ జరిపినట్టు యూఎ్‌ససీఐఆర్‌ఎఫ్ వెల్లడించింది. కాగా యూఎ్‌ససీఐఆర్‌ఎఫ్ ఇంతకుముందు కూడా చేసిన ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. ఆ నివేదిక పక్షపాతంతో కూడుకున్నదని పేర్కొంది.
Updated Date - 2023-09-22T02:43:38+05:30 IST