పబ్‌లలో 18 ఏళ్లలోపు వారిని అనుమతించొద్దు
ABN, First Publish Date - 2023-09-04T02:25:16+05:30
పబ్‌లు, బార్లలోకి 18 ఏళ్ల లోపువారిని అనుమతించరాదని కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రైవేటు విద్యాసంస్థల పాలకమండలి విజ్ఞప్తి చేసింది.
కర్ణాటక ప్రభుత్వానికి ప్రైవేట్
విద్యాసంస్థల పాలక మండలి వినతి
బెంగళూరు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పబ్‌లు, బార్లలోకి 18 ఏళ్ల లోపువారిని అనుమతించరాదని కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రైవేటు విద్యాసంస్థల పాలకమండలి విజ్ఞప్తి చేసింది. కేవలం వ్యాపార దృష్టితో బెంగళూరులోని పబ్‌లు, హుక్కాబార్‌లు విద్యార్థుల పండంటి జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయని ఆ సంస్థ ఆరోపించింది. పబ్‌లలోనూ, హుక్కాబార్‌లలోనూ 18ఏళ్లలోపు వారికి అనుమతి ఇవ్వరాదన్న నిబంధనలున్నా వీటిని పాటించడం లేదని ఆక్షేపించింది. పబ్‌లు, బార్‌లలో మైనర్లు కనిపిస్తే తక్షణం లైసెన్సు రద్దు చేయడం వంటి కఠిన చర్యలు చేపట్టాలని కోరింది.
Updated Date - 2023-09-04T02:25:16+05:30 IST