ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Udayanidhi: డీఎంకేలో యువశక్తి

ABN, First Publish Date - 2023-01-25T08:02:49+05:30

డీఎంకే యువజన విభాగంలో ఖాళీ పదవులకు ఆ విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Udayanidhi)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- యువజన విభాగం పదవులకు ఉదయనిధి ఇంటర్వ్యూలు

చెన్నై, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): డీఎంకే యువజన విభాగంలో ఖాళీ పదవులకు ఆ విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Udayanidhi) మంగళవారం ఉదయం ఇంటర్వ్యూలు నిర్వహించారు. డీఎంకే యువజన విభాగంలో సాంకేతిక సమాచార విభాగం, మహిళా విభాగం, వైద్యుల విభాగం సహా అన్ని విభాగాలకు కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ విభాగాలకు ఆశావహుల నుంచి ఇంటీవల దరఖాస్తులు స్వీకరించారు. ఈ నేపథ్యంలో తేనాంపేటలోని డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యాలయం అన్బగమ్‌లో ఉదయనిధి ఇంటర్వ్యూలు నిర్వహించారు. చెన్నై ఈస్ట్‌, నార్త్‌, సౌత్‌, వెస్ట్‌ తదితర జిల్లాలకు చెందిన వారితో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ కార్యాలయం వద్ద ఉదయం నుండే బారులు తీరారు.

క్రీడా పోటీలు ప్రారంభం... : సీఎం ట్రోఫీ క్రీడాపోటీల్లో భాగంగా మంగళవారం ఉదయం చెన్నై జిల్లా స్థాయి క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. మేడే పార్కు మైదానంలో, టి.నగర్‌ నటేశన్‌పార్కు క్రీడా మైదానంలో ఈ పోటీలను మంత్రి ఉదయనిధి ప్రారంభించారు. ఈ రెండు మైదానాల్లో నిర్వహించిన కబడ్డీ, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌ పోటీలలో క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ ఆర్‌ ప్రియ, ఎంపీ కళానిధి మారన్‌, రాష్ట్ర క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి అతుల్యమిశ్రా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T08:02:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising