Training: ఈరోడ్‌లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ
ABN, First Publish Date - 2023-02-07T10:16:05+05:30
ఈరోడ్ ఈస్ట్(Erode East) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్, కౌంటింగ్‌కు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి తొలి విడత శిక్షణ(Training) సోమవారం ఉదయం
చెన్నై, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఈరోడ్ ఈస్ట్(Erode East) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్, కౌంటింగ్‌కు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి తొలి విడత శిక్షణ(Training) సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ నెల 27న జరుగనున్న ఈ ఎన్నిక కోసం నియోజకవర్గంలో 238 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ డ్యూటీలో పాల్గొనే 1206 మంది ఉద్యోగులకు మూడు విడతల్లో శిక్షణఇవ్వనున్నారు. ఆ మేరకు ఈరోడ్ రంగంపాళయంలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో పోలింగ్ సిబ్బంది, అధికారులకు తొలివిడత శిక్షణ నిర్వహించారు.
రోజుకు రూ.500లు...
ఈరోడ్‌ఈస్ట్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఆ నియోజకవర్గంలోని 33 వార్డుల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఎన్నికల ప్రచార కార్యాలయాలను ప్రారంభించాయి. ఆ కార్యాలయాలలలో పేర్లను నమోదు చేసుకుని ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది వరకు ప్రచారం చేస్తే రూ.500లు ఇస్తున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఇలా పోటీపడి తమ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవారికి ఇలా నోట్ల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో రోజువారీ కూలీ పనులకు వెళ్లేవారు కూడా పార్టీ రంగుల తువ్వాలు భుజాన వేసుకుని ప్రచారానికి వెళ్తున్నారు. కూలి పనులకు వెళితే రోజుకు రూ.300లు మాత్రమే లభిస్తోందని, ఎన్నికల పార్టీ ఆఫీసుల వద్ద పనిచేస్తే సులువుగా రూ.500ల లభిస్తోందని కూలీ కార్మికులు చెబుతున్నారు. పోలింగ్ జరుగనున్న ఈ నెల 27 వరకూ ఇలా ప్రధాన పార్టీలు ప్రచారం చేసేవారిపై నోట్ల వర్షం కురిపించనున్నాయి.
Updated Date - 2023-02-07T10:16:07+05:30 IST