ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రీడీలో చిక్కిన వాసన అణువు పనితీరు గుట్టు!

ABN, First Publish Date - 2023-03-19T01:16:17+05:30

మనిషికి ఉండే పంచేంద్రియ జ్ఞానంలో వాసన శక్తి కూడా ఒకటి. మిగిలిన ఇంద్రియ జ్ఞానం గురించి పరిశోధకులకు కొంతమేర అవగాహన ఉన్నా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ, మార్చి 18: మనిషికి ఉండే పంచేంద్రియ జ్ఞానంలో వాసన శక్తి కూడా ఒకటి. మిగిలిన ఇంద్రియ జ్ఞానం గురించి పరిశోధకులకు కొంతమేర అవగాహన ఉన్నా.. వాసనను శరీరంలోని రిసెప్టెర్లు ఎలా గ్రహిస్తాయన్నదానిపై స్పష్టత లేదు. అయితే.. అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు ఈ దిశగా ఓ కీలక మైలురాయిని చేరుకున్నారు. మనలోని వాసన గ్రాహాకాల్ని వాసన అణువు క్రియాశీలం చేసే ఘట్టాన్ని త్రీడీలో చిత్రించగలిగారు. ‘‘ఒక వాసనను మనం పసిగట్టేందుకు శరీరంలోని 400 రిసెప్టర్లు పనిచేస్తాయి. మనం గుర్తించే లక్షలాది వాసనల్లో ప్రతి ఒక్కటీ వివిధ వాసన అణువుల సమ్మేళనం. పియానోపై ఒక కీ నొక్కగానే ఒక స్వరం పలికినట్లుగా, ఒక్కో వాసనకు ఒక్కోలా రిసెప్టర్లు స్పందిస్తాయి. మా అధ్యయనంలో భాగంగా.. ఓఆర్‌51ఈ2 అనే రిసెప్టర్‌ను ఎంచుకున్నాం. సాంకేతికంగా పలు అడ్డంకుల్ని దాటి ఈ రిసెప్టర్‌ను బంధించగలిగాం. ఈ క్రమంలో వాసనను మానవ శరీరంలోని రిసెప్టర్‌ గుర్తించే చర్యను తొలిసారిగా గమనించాం’’ అని పరిశోధకులు తెలిపారు.

Updated Date - 2023-03-19T01:16:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising