ఐఏఎఫ్ చేతికి తొలి తేజస్ ట్విన్ సీటర్
ABN, First Publish Date - 2023-10-05T02:13:01+05:30
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) తొలిసారిగా రెండు సీట్లతో రూపొందించిన ఎల్‌సీఏ తేజస్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను బుధవారం వాయుసేనకు అప్పగించింది...
బెంగళూరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) తొలిసారిగా రెండు సీట్లతో రూపొందించిన ఎల్‌సీఏ తేజస్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను బుధవారం వాయుసేనకు అప్పగించింది. బెంగళూరులోని హాల్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) శిక్షణ అవసరాలకు అనుగుణంగా ఇద్దరు కూర్చునే విధంగా దీన్ని పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినట్టు హాల్ సీఎండీ సీబీ అనంతకృష్ణన్ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ పరికల్పనలో భాగంగా కేంద్ర రక్షణశాఖ సహకారంతో దీన్ని తయారు చేశామన్నారు. ఇది ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ అయినా.. అత్యవసర సమయాల్లో పూర్తిస్థాయి యుద్ధ విమానంగా పనిచేసే సామర్థ్యం దీనికి ఉందని హాల్ పేర్కొంది.
Updated Date - 2023-10-05T02:13:01+05:30 IST