ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Gandhi : నన్ను పప్పుగా చూపించేందుకు వేల కోట్లు ఖర్చు పెట్టారు

ABN, First Publish Date - 2023-01-25T01:05:36+05:30

బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ యంత్రాంగం తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు వేల కోట్లు ఖర్చు పెట్టిందని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాల్లో తనను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ నేతలపై రాహుల్‌గాంధీ ఆరోపణ

జమ్మూ, జనవరి 24: బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ యంత్రాంగం తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు వేల కోట్లు ఖర్చు పెట్టిందని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాల్లో తనను ఏమీ చేతకాని వాడిగా(పప్పు)గా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. భారతదేశంలో సత్యమే పని చేస్తుంది తప్ప డబ్బు, అధికారం, గర్వం కాదనే పాఠాన్ని త్వరలోనే బీజేపీకి అవగతం అయ్యేట్లు చేస్తామని చెప్పారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా జమ్మూ కశ్మీరులో పాదయాత్ర చేస్తున్న రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు. డబ్బు, అధికారంతో ఏదైనా చేయొచ్చనే అభిప్రాయంతో బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ నేతలున్నారని చెప్పారు. డబ్బు, అధికారాన్ని పక్కకుతోసి నిజం ముందుకు వస్తుందనే విషయం ఇప్పుడిప్పుడే వారికి అర్థం అవుతోందన్నారు. కాగా, పాకిస్థాన్‌ మీద భారత సైన్యం సర్జికల్‌ దాడులు చేసిందనడానికి ఆధారాల్లేవని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను హాస్యాస్పదమంటూ రాహుల్‌గాంధీ తోసిపుచ్చారు. దిగ్విజయ్‌ అభిప్రాయాలతో తాము ఏకీభవించడం లేదన్నారు. ఆయన అభిప్రాయం కన్నా పార్టీ అభిప్రాయమే ఉన్నతమైనదని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-01-25T01:05:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising