ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు బిడ్డ సిద్దూ!

ABN, First Publish Date - 2023-05-19T02:47:59+05:30

కర్ణాటకలో బీజేపీ ఓటమికి బాటలు వేసి, కాంగ్రెస్‌ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డిన సిద్దరామయ్య రాష్ట్రంలోని మూడో అతిపెద్ద సామాజిక వర్గమైన కురుబ కులానికి చెందినవారు. మారుమూల పల్లెలో సాధారణమైన రైతు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

● పదమూడు సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రికార్డు

బెంగళూరు–ఆంధ్రజ్యోతి) : కర్ణాటకలో బీజేపీ ఓటమికి బాటలు వేసి, కాంగ్రెస్‌ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డిన సిద్దరామయ్య రాష్ట్రంలోని మూడో అతిపెద్ద సామాజిక వర్గమైన కురుబ కులానికి చెందినవారు. మారుమూల పల్లెలో సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి, అనూహ్యంగా రాజకీయాల వైపు వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. సిద్దరామయ్యకు 2013 నుంచి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పాలించిన అనుభవం ఉంది. నిరుపేద కుటుంబం నుంచి రెండుసార్లు సీఎం పదవిని అధిష్ఠించే వరకూ సిద్దరామయ్య ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిద్దాం..

ఓటమితో రాజకీయ జీవితం ప్రారంభం

మైసూరు జిల్లా వరుణ హోబళి సిద్దరామనహుండి గ్రామానికి చెందిన సిద్దరామేగౌడ, బోరమ్మ దంపతులకు 1948 ఆగస్టు 12న సిద్దరామయ్య జన్మించారు. ఐదుగురు సంతానంలో సిద్దరామయ్య రెండోవారు. ఉమ్మడి కుటుంబంలో జన్మించిన ఆయన పదేళ్లు వచ్చేవరకూ గొర్రెల కాపరిగా పనిచేశారు. గ్రామానికి చెందిన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నేరుగా ఐదో తరగతిలో చేరారు. పదో తరగతి దాకా సొంతూరులోనే చదివారు. మైసూరు యూనివర్సిటీ నుంచి లా కోర్సు చేసిన సిద్దరామయ్య సీనియర్‌ న్యాయవాది చిక్కబోరయ్య వద్ద జూనియర్‌గా చేరారు. 1978 నాటికి సొంతగా న్యాయవాది స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో 1980లో మైసూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. 1983 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మితవాదిగా ముద్రపడిన ఆయనకు టికెట్‌ ఇవ్వడానికి జనతాదళ్‌ అధ్యక్షుడు దేవెగౌడ సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో భారతీయ లోకదళ్‌ పార్టీ నుంచి మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజకవర్గంలో తొలిసారి గెలుపొందారు. 1985లో చాముండేశ్వరి నుంచి మరోసారి గెలుపొంది, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో సిద్దరామయ్యకు పలు రికార్డులు ఉన్నాయి. కాంగ్రెస్‌ పాలనలో దేవరాజు అరసు, ఎస్‌ఎం కృష్ణ తర్వాత సిద్దరామయ్య ఐదేళ్ల పాటు సీఎంగా అధికార వ్యవధిని పూర్తి చేసుకున్నారు. రెండుసార్లు ఆర్థిక మంత్రి హోదాతో పాటు ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆర్థికమంత్రిగా రెండుసార్లు, డీసీఎంగా ఐదుసార్లు, ముఖ్యమంత్రి హోదాలో ఆరుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

Updated Date - 2023-05-19T02:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising