ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇందిర హత్యపై కెనడాలో శకటం ప్రదర్శన

ABN, First Publish Date - 2023-06-09T03:27:32+05:30

కెనడాలో ఖలిస్థాన్‌ మద్దతుదారులు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను కీర్తిస్తూ ఓ శకటాన్ని ప్రదర్శించడం దుమారం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖలిస్థాన్‌ మద్దతుదారుల దుశ్చర్యపై భారత్‌ ఆగ్రహం

న్యూఢిల్లీ, జనవరి 8: కెనడాలో ఖలిస్థాన్‌ మద్దతుదారులు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను కీర్తిస్తూ ఓ శకటాన్ని ప్రదర్శించడం దుమారం రేపుతోంది. ఇందిరా గాంధీపై ఆమె బాడీగార్డులు కాల్పులు జరుపుతున్న దృశ్యాన్ని బొమ్మలతో కళ్లకు కడుతూ ఈ శకటం రూపొందించారు. ‘బ్లూ స్టార్‌ ఆపరేషన్‌’ జరిగి 39 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ నెల 4న బ్రాంప్టన్‌ నగరంలో నిర్వహించిన పరేడ్‌లో ఈ శకటాన్ని ప్రదర్శించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ ఉదంతంపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడాలో వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను ప్రోత్సహించేవారికి చోటివ్వడం భారత్‌తో ఆ దేశం సంబంధాలకు మంచిది కాదని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పష్టం చేశారు. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని కెనడా ప్రభుత్వంతో మాట్లాడాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ కోరారు.

Updated Date - 2023-06-09T03:27:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising