ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Satyaprad Sahu: ఉపఎన్నికలో కొవిడ్‌ నిబంధనలు అక్కర్లేదు

ABN, First Publish Date - 2023-01-25T10:07:13+05:30

ఈరోడ్‌ తూర్పు ఉప ఎన్నిక కోసం ఏర్పాటుచేయనున్న పోలింగ్‌ కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు

పెరంబూర్‌(చెన్నై), జనవరి 24: ఈరోడ్‌ తూర్పు ఉప ఎన్నిక కోసం ఏర్పాటుచేయనున్న పోలింగ్‌ కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు(Satyaprad Sahu) స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఈ నెల 31న ప్రారంభం కానుంది. నామినేషన్లకు ముందుగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఎన్నికల ఏర్పాట్లకు అవసరమైన నిధులు, పోలింగ్‌ సిబ్బంది తదితర వివరాలు అందించాలని జిల్లా ఎన్నికల అధికారిని ఈసీ కోరింది. ఈ విషయమై మంగళవారం ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు మీడియాతో మాట్లాడుతూ... ప్రతి నియోజకవర్గంలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తిస్తున్నామని, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అలాంటి పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెరిగే అవకాశముంటుందని, వాటి వివరాలు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. అలాగే, ఎన్నిక ఏర్పాట్ల ఖర్చులకు సంబంధించి నిధుల కోసం ఆర్ధిక శాఖ అనుమతి అవసరముందని, అందుకోసం పూర్తి నివేదిక అందజేయాలని కోరామన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నియంత్రణలోకి రావడంతో ఈరోడ్‌ తూర్పు ఉప ఎన్నికలో కరోనా నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని తెలిపారు.

Updated Date - 2023-01-25T10:07:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising