ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Garbha Sanskar: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరికొత్త క్యాంపెయిన్

ABN, First Publish Date - 2023-03-06T22:44:37+05:30

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) గర్భ సంస్కార్ (Garbha Sanskar) పేరిట సరికొత్త క్యాంపెయిన్ చేపట్టనుంది.

Garbha Sanskar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) గర్భ సంస్కార్ (Garbha Sanskar) పేరిట సరికొత్త క్యాంపెయిన్ చేపట్టనుంది. తల్లి కడుపు(womb)లో శిశువు పెరుగుతున్న సమయంలోనే రామాయణం (Ramayanam), భగవద్గీత(Gita) వినిపించాలని నిర్ణయించింది. సంస్కృతి, విలువలు గర్భంలో ఉండగానే వీటిని అలవాటు చేసేలా తల్లులకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. ఆర్ఎస్ఎస్‌లోని సంవర్ధినీ న్యాస్(Samvardhinee Nyas) టీమ్ ఇప్పటికే క్యాంపెయిన్ చేపట్టింది. ఈ క్యాంపెయినింగ్ టీమ్‌లో గైనకాలజిస్టులు, ఆయుర్వేద డాక్టర్లు, యోగా శిక్షకులు ఉంటారు.

తల్లి గర్భం దాల్చినప్పటినుంచీ శిశువుకు రెండేళ్ల వయసు వచ్చేవరకూ ఈ శిక్షణ కొనసాగుతుంది. శిశువు తల్లి కడుపులో ఉండగానే ఐదొందల పదాల వరకూ నేర్చుకుంటుందని క్యాంపెయిన్ టీమ్ అంచనా వేసింది.

ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర సేవికా సమితి (Rashtra Sevika Samiti) కనీసం వెయ్యి మంది మహిళలకు గర్భ సంస్కార్ శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వర్క్‌షాప్ జరిగింది. దీనికి పలువురు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి సహా పలు ఆసుపత్రుల నుంచి గైనకాలజిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Updated Date - 2023-03-06T22:45:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising