ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోడో యాత్ర పునఃప్రారంభం

ABN, First Publish Date - 2023-01-29T02:25:04+05:30

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర శనివారం జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పునఃప్రారంభమైంది. భద్రతా కారణాల రీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు.. రాహుల్‌ చుట్టూ మూడంచెల రక్షణ వలయం

- పుల్వామా అమరులకు రాహుల్‌ నివాళి

అవంతీపొరా/లెత్పోరా (పుల్వామా), జనవరి 28: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర శనివారం జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పునఃప్రారంభమైంది. భద్రతా కారణాల రీత్యా శుక్రవారం యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 9.20 గంటలకు తెల్లటి టీషర్ట్‌పై స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించిన రాహుల్‌గాంధీ అవంతీపొరా ప్రాంతం నుంచి నడక ప్రారంభించారు. పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీతో పాటు పెద్దసంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు. శుక్రవారం ఘటనలను దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. రాహుల్‌ చుట్టూ మూడంచెల భద్రతా వలయం ఏర్పాటు చేశారు. కాగా, పుల్వామా జిల్లాలో 2019 ఫిబ్రవరిలో జరిగిన కారు బాంబు పేలుడులో మరణించిన 40మంది జవాన్లకు రాహుల్‌ నివాళులర్పించారు. జైషే మహ్మద్‌ ఆత్మాహుతి బాంబర్‌ సీఆర్‌పీఎఫ్‌ బస్సును పేల్చేసిన ప్రదేశంలో ఆయన పుప్ఫగుచ్ఛం ఉంచారు. కాగా, జోడో యాత్ర చివరి దశకు చేరుకుంటున్న వేళ లెత్పోరాలో రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఆయనతో కలసి అడుగులేశారు. రాహుల్‌ గాంధీ పర్యటన కశ్మీర్‌లో స్వచ్ఛమైన శ్వాసలా వచ్చిందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. 2019 తర్వాత కశ్మీరీ ప్రజలు ఇంత పెద్దసంఖ్యలో తమ ఇళ్ల నుంచి బయటకు రావడం ఇదే మొదటిసారన్నారు.

అమిత్‌ షాకు ఖర్గే లేఖ

జమ్ముకశ్మీర్‌లో భారత్‌ జోడో యాత్రకు తగిన భద్రత కల్పించే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. రానున్న రెండు రోజుల్లో యాత్రకు భారీగా జనసందోహం తరలివచ్చే అవకాశం ఉందని, 30న శ్రీనగర్‌లో జరిగే ముగింపు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని యాత్రకు తగిన భద్రత కల్పించే విధంగా అధికారులకు సూచించాలని షాను ఖర్గే కోరారు.

ఏ కూటమికైనా కాంగ్రెస్సే కేంద్రం

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే ఎటువంటి విపక్ష కూటమి అయినా కాంగ్రెస్‌ కేంద్రంగానే నిర్మాణం అవుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ స్పష్టం చేశారు. అయితే, 2029 జాతీయ ఎన్నికలను మాత్రం ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ఒంటరిగానే ఎదుర్కొంటుందని తెలిపారు. జోడో యాత్రకు కొనసాగింపుగా ఈసారి గుజరాత్‌లోని పోరుబందరు నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోని పరశురామ్‌ ఖుండ్‌ వరకు పాదయాత్ర జరిగితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికి ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. భారత్‌ జోడోకు ఎన్నికలతో నిమిత్తం లేదన్న ఆయన.. ‘నిద్రిస్తున్న మహాకాయుని’ స్థితిలోని తమ పార్టీకి ఈ యాత్ర పునరుత్తేజాన్ని తెచ్చిందని జైరామ్‌ అన్నారు. బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే కేవలం వ్యతిరేక వాదాలతోనే పనికాదని, స్పష్టమైన అజెండా కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2023-01-29T02:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising