రవి కణ్ణన్‌కు రామన్ మెగసెసె పురస్కారం
ABN, First Publish Date - 2023-09-02T02:44:44+05:30
అసోంలో కేన్సర్ నిపుణుడిగా పనిచేస్తున్న సర్జికల్ ఆంకాలజిస్టు ఆర్ రవి కణ్ణన్‌ను ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె పురస్కారం వరించింది.
మనీలా, సెప్టెంబరు 1: అసోంలో కేన్సర్ నిపుణుడిగా పనిచేస్తున్న సర్జికల్ ఆంకాలజిస్టు ఆర్ రవి కణ్ణన్‌ను ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె పురస్కారం వరించింది. ఈ ఏడాది పురస్కార విజేతల్లో ఆయన పేరును అవార్డు ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. అసోంలో నిరుపేదలకు ఆయన అందిస్తున్న కేన్సర్ చికిత్సకు గాను ఎంపిక చేసినట్లు తెలిపింది. చెన్నైలోని కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో కణ్ణన్ పనిచేసేవారు. 2007లో అసోంలోని సిల్చార్‌లో కాచర్ కేన్సర్ ఆస్పత్రిలో చేరారు. కణ్ణన్ రాక అనంతరం ఆస్పత్రి పూర్తిస్థాయిలో కేన్సర్ చికిత్స సేవల్ని ప్రారంభించింది. కాగా.. కేన్సర్ బాధితుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్న వారందరికీ తన పురస్కారం దక్కుతుందని కణ్ణన్ పేర్కొన్నారు.
Updated Date - 2023-09-02T02:44:44+05:30 IST