ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌ ‘అనర్హత’ను గమనిస్తున్నాం

ABN, First Publish Date - 2023-03-31T03:27:14+05:30

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అనర్హత వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఇప్పటికే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తీర్పుపై ఆయన అప్పీలు చేసుకోవచ్చు.. స్పందించిన జర్మనీ

న్యూఢిల్లీ, మార్చి 30: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అనర్హత వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఇప్పటికే అమెరికా మాట్లాడగా, తాజాగా జర్మనీ స్పందించింది. జర్మనీ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో విపక్ష నేత రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష విధించడం, ఎంపీగా అనర్హుడిగా ప్రకటించిన అంశాలను మేం గమనిస్తున్నాం. ఈ తీర్పుపై రాహుల్‌ అప్పీలు చేసుకునే స్థితిలో ఉన్నారు. అప్పుడే ఈ తీర్పు నిలబడుతుందా? ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేయడానికి ఏదైనా ప్రాతిపదిక ఉందా? అనేది స్పష్టమవుతుంది. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రమాణాలు, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు రాహుల్‌ కేసుకు వర్తిస్తాయని జర్మనీ భావిస్తోంది’’ అని అన్నారు. ఈ వీడియోను జర్మనీకి చెందిన సీనియర్‌ ఎడిటర్‌ రిచర్డ్‌ వాకర్‌ పోస్టు చేశారు.

రాహుల్‌ను బ్రిటన్‌ కోర్టుకు లాగుతా: లలిత్‌ మోదీ

లండన్‌, మార్చి 30: రాహుల్‌ గాంధీపై ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీ వరుస ట్వీట్లలో మండిపడ్డారు. ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై రాహుల్‌ను బ్రిటన్‌లో కోర్టుకు లాగుతానని తెలిపారు. తాను న్యాయ ప్రక్రియ నుంచి తప్పించుకుని పారిపోయానని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారని, ఇప్పటి వరకు తాను ఏ కేసులోనైనా రాహుల్‌ గాంధీలా దోషిగా తేలానా అని ప్రశ్నించారు. తాను బ్రిటన్‌లో పరువు నష్టం దావా వేసినప్పుడు రాహుల్‌ బలమైన ఆధారాలతో రావాల్సి ఉంటుందన్నారు.

Updated Date - 2023-03-31T03:27:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising