Rahul: రాహుల్.. ఇల్లు ఖాళీ చేయండి!
ABN, First Publish Date - 2023-03-28T03:07:43+05:30
మీకు కేటాయించిన అధికారిక బంగళాను ఖాళీ చేయండి’ అంటూ కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీకి నోటీసులు అందాయి. పరువు నష్టం కేసులో రాహుల్‌కు కోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
అధికారిక నివాసాన్ని వీడాలంటూ లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు
న్యూఢిల్లీ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ‘మీకు కేటాయించిన అధికారిక బంగళాను ఖాళీ చేయండి’ అంటూ కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీకి నోటీసులు అందాయి. పరువు నష్టం కేసులో రాహుల్‌కు కోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే లోక్‌సభ సచివాలయం ఆయన్ను అనర్హుడిగా ప్రకటించడంతో లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు. నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడిన లోక్‌సభ సభ్యు డు ప్రభుత్వం కల్పించిన వసతి సౌకర్యాన్ని వీడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాహుల్‌కు ప్రభుత్వం కేటాయించిన బంగళాను ఖాళీ చేయాలంటూ లోక్‌సభ హౌసింగ్ కమిటీ సోమవారం నోటీసులు జారీ చేసిం ది. ఆయన 12, తుగ్లక్ లేన్‌లోని బంగళాలో 2005 నుంచి ఉంటున్నారు. ప్రభుత్వం కేటాయించిన ఈ అధికారిక నివాసాన్ని 30 రోజుల్లో (ఏప్రిల్ 22)గా ఖాళీ చేయాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
లోక్‌సభ హౌసింగ్ కమిటీ చైర్మన్‌గా బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు, నవసారి ఎంపీ సీఆర్ పాటిల్ ఉన్నారు. అయి తే జడ్ ప్లస్ భద్రతతో ఉన్న రాహుల్ గాంధీకి ప్రభు త్వ నివాసం పొందే హక్కు ఉన్న రీత్యా హౌసింగ్ కమిటీ నోటీసు సాంకేతికమేనని భావిస్తున్నారు. రాహుల్‌ని ఇల్లు ఖాళీ చేయమనడంలో ఆశ్చర్యం లేదని కాంగ్రెస్ ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి నసీర్ హుస్సేన్ అన్నారు. నిరసనను తొక్కి పెట్టడానికి బీజేపీ అన్ని రకాల ఆయుధాలను వాడుతోందని చెప్పారు. రాహుల్ వంటి ముఖ్యమైన నేతనే పార్లమెంట్ నుంచి బహిష్కరించిన తర్వాత ఏదైనా జరగొచ్చని అన్నారు. ప్రతి ఎంపీకి సభ్వత్వం కోల్పోయిన తర్వాత అధికార నివాసాన్ని ఖాళీ చేసేందుకు 3 నుంచి 6 నెలల సమయం ఉంటుందని తెలిపారు.
Updated Date - 2023-03-28T03:07:43+05:30 IST