Corruption Case: మాజీ మంత్రి, ఐఎఎస్ అధికారిణిపై విజిలెన్స్ కేసు
ABN, First Publish Date - 2023-01-06T08:18:27+05:30
అవినీతి, అక్రమాల కేసులో పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి సుందర్ శామ్ అరోరా, ఐఏఎస్ అధికారిణి నీలిమపై పంజాబ్ విజిలెన్స్ బ్యూరో కేసు....
చండీఘడ్ (పంజాబ్) : అవినీతి, అక్రమాల కేసులో పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి సుందర్ శామ్ అరోరా, ఐఏఎస్ అధికారిణి నీలిమపై పంజాబ్ విజిలెన్స్ బ్యూరో కేసు నమోదు చేసింది.(Punjab Vigilance Bureau)పంజాబ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (పిఎస్‌ఐడీసీ)కి చెందిన ఏడుగురు అధికారులను పంజాబ్ విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది.పారిశ్రామిక ప్లాట్‌ను రియల్టర్ కంపెనీకి బదిలీ చేసి, ప్లాట్లను విభజించి టౌన్‌షిప్ ఏర్పాటుకు అనుమతించినందుకు మాజీ మంత్రి సుందర్ శామ్ అరోరా(ex minister Sunder Sham), ఐఎఎస్ అధికారిణి నీలిమ(IAS officer Neelima), మరో 10 మంది ప్రభుత్వ అధికారులపై పంజాబ్ విజిలెన్స్ బ్యూరో క్రిమినల్ కేసు నమోదు చేసింది.(registers case) ఈ కేసుకు సంబంధించి గుల్‌మోహర్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్టర్ సంస్థకు చెందిన ముగ్గురు యజమానులపై కూడా కేసు పెట్టింది.
పంజాబ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు చెందిన ఎస్టేట్ ఆఫీసర్ అంకుర్ చౌదరి, పర్సనల్ జీఎం దేవిందపాల్ సింగ్, చీఫ్ జనరల్ మేనేజర్ (ప్లానింగ్) జేఎస్ భాటియా, అషిమా అగర్వాల్, పర్మీందర్ సింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రజత్ కుమార్ లను అరెస్టు చేశారు. రియల్టర్ సంస్థకు అనవసర ప్రయోజనాలను అందించడానికి మంత్రి, అధికారులు వారితో కుమ్మక్కయ్యారు.
Updated Date - 2023-01-06T08:22:43+05:30 IST