Pulse polio: రేపు పల్స్ పోలియో
ABN, First Publish Date - 2023-01-03T08:52:24+05:30
రాష్ట్రంలో ఈ నెల 4న మూడోవిడత పల్స్ పోలియో(Pulse polio) కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ
అడయార్(చెన్నై), జనవరి 2: రాష్ట్రంలో ఈ నెల 4న మూడోవిడత పల్స్ పోలియో(Pulse polio) కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం తెలిపారు. ఈ మేరకు ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు పంపారు. గత 18 యేళ్ళుగా పోలియో రహిత రాష్ట్రంగా పేరుపొందించి. అదేసమయంలో భవిష్యత్‌లో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాకుండా ఉండేలా ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ దిశగా ప్రతి యేటా రెండు విడతలుగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 4 న పల్స్ పోలియో శిబిరాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు ఆరోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం వెల్లడించారు. ఇదే విషయంపై ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపిన ఉత్తర్వుల్లో జాతీయ టీకా విధానం (నేషనల్ వ్యాక్సినేషన్ పాలసీ)లో భాగంగా, ఈ నెల 4న రాష్ట్ర వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి యేటా 10 లక్షల మంది గర్భిణులకు 9 లక్షల మంది చిన్నారులకు వివిధ రకాల టీకాలు వేస్తున్నామని, నవజాత శిశువులకు పుట్టిన ఆరో వారంలో, 14వ వారంలో పోలియో డ్రాప్స్ వేస్తున్నామని తెలిపారు. ఈ నెల 4న రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో శిబిరాలను ఏర్పాటు చేయనున్నామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశాలిచ్చారు.
Updated Date - 2023-01-03T08:52:27+05:30 IST