పీఎం కిసాన్ మరో 2వేలు!
ABN, First Publish Date - 2023-01-29T02:28:39+05:30
పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని మరో 2 వేలు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పీఎం-కిసాన్ కింద రైతులకు నాలుగు నెలలకు ఒకసారి మూడు సమాన
- రూ.8వేలకు చేరనున్న వార్షిక సాయం
న్యూఢిల్లీ, జనవరి 28: పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని మరో 2 వేలు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పీఎం-కిసాన్ కింద రైతులకు నాలుగు నెలలకు ఒకసారి మూడు సమాన వాయిదాల్లో రూ.2,000 చొప్పున రూ.6,000 అందజేస్తున్న విషయం తెలిసిందే. అదనంగా రూ.2,000 ఇవ్వడం వల్ల కేంద్రంపై రూ.22,000 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. రైతులకు సాయాన్ని పెంచేందుకు సంబంధించిన ఒక ప్రతిపాదనను కేంద్ర బడ్జెట్ రూపకల్పన సందర్భంగా చర్చించినట్టుగా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న రూ.6,000 సాయాన్ని రెండింతలు చేయాలన్న ప్రతిపాదన కూడా వచ్చినట్టు సమాచారం. పీఎం కిసాన్ సాయం పెంపు విషయాన్ని ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ వార్షిక మొత్తాన్ని రూ.8,000కు పెంచితే వాయిదాలను నాలుగుకు పెంచే అవకాశం ఉందంటున్నారు.
Updated Date - 2023-01-29T02:28:41+05:30 IST