Operation Trinetra : కంది అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న ఆపరేషన్ త్రినేత్ర
ABN, First Publish Date - 2023-05-06T10:29:54+05:30
జమ్మూకాశ్మీర్ రాజౌరి సెక్టార్ కంది అటవీ ప్రాంతంలో ఆపరేషన్ త్రినేత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఒక ఉగ్రవాది హతం కాగా... మరొకరికి తీవ్ర గాయాలు అయినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ : జమ్మూకాశ్మీర్ రాజౌరి సెక్టార్ కంది అటవీ ప్రాంతంలో ఆపరేషన్ త్రినేత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఒక ఉగ్రవాది హతం కాగా... మరొకరికి తీవ్ర గాయాలు అయినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రమూకల నుంచి ఆయుధాలు, మందుగుండును భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూకశ్మీర్ పోలీస్, సీఆర్‌పీఎఫ్ జవాన్లతో కలిసి ఆర్మీ ఆపరేషన్ త్రినేత్రను చేపట్టింది. ఒక ఏకే 56, 4 మాగ్జిన్లు, 56 రౌండ్ల ఏకే 56 బుల్లెట్లు, 9ఎంఎం పిస్టల్, మాగ్జిన్, 3 గ్రెనేడ్‌లు, ఇతర మందుగుండు సామాగ్రి.. ఇవన్నీ ధరించేందుకు ఉపాయిగించిం జాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. హతమైన ఉగ్రవాది ఎవరనేది ఆర్మీ ఆరా తీస్తోంది. సుమారు ఏడు గంటలుగా కొనసాగిన కార్డన్ సెర్చ్‌లో సైనిక బలగాలు మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ఆపరేషన్ త్రినేత్ర కొనసాగుతున్నట్లు ఆర్మీ వెల్లడించింది.
Updated Date - 2023-05-06T10:29:54+05:30 IST