ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Onions: గల్ఫ్‌ నుంచి విమానంలో ఉల్లిగడ్డలు..

ABN, First Publish Date - 2023-01-15T03:20:36+05:30

వారు తీసుకెళ్లింది బంగారం కాదు.. డ్రగ్స్‌ అంతకన్నా కాదు.. వంటల్లో వాడుకునేందుకు కొన్ని ఉల్లిగడ్డలు!!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిలిప్పీన్స్‌ విమాన సిబ్బందిపై స్మగ్లింగ్‌ కేసు!

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వారు తీసుకెళ్లింది బంగారం కాదు.. డ్రగ్స్‌ అంతకన్నా కాదు.. వంటల్లో వాడుకునేందుకు కొన్ని ఉల్లిగడ్డలు!! ఉల్లి బస్తాలతో వారిని విమానాశ్రయంలో పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు స్మగ్లింగ్‌ కేసు పెట్టారు!! ఫిలిప్పీన్స్‌లో జరిగిందీ ఘటన. ఫిలిప్పీన్స్‌లో ఉల్లిగడ్డల ధరలు మండుతుండటం.. సౌదీలో చౌకగా దొరుకుతుండటంతో అక్కడి నుంచి ఫిలిప్పీన్స్‌ ప్రవాసీయుల్లో కొందరు ఉల్లిని స్వదేశానికి తీసుకెళుతున్నారు. ఫిలిప్పీన్స్‌లో ప్రస్తుతం చికెన్‌ ఽధర కంటే ఉల్లి ధరే ఎక్కువగా ఉంది. దుబాయిలో కిలో ఉల్లి రెండున్నర దిర్హాంలకు దొరుకుతుంటే ఫిలిప్పీన్స్‌లో అందుకు 40 దిర్హాంలు వెచ్చించాల్సి వస్తోంది. ఫలితంగా గల్ఫ్‌లో చౌకగా లభించే భారత్‌, యమెన్‌ దేశాల ఉల్లిగడ్డను ఫిలిప్పీన్స్‌ వాసులు పెద్ద సంఖ్యలో స్వదేశానికి తీసుకెళుతున్నారు. విలువైన బహుమతులకు బదులుగా ఉల్లిగడ్డలను తీసుకెళ్లేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ తరహా వినియోగదారుల్లో వైమానిక సిబ్బందీ ఉంటున్నారు. గల్ఫ్‌లోని రియాద్‌, దుబాయి, నగరాల నుంచి మనీలాకు ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు, కొన్ని పళ్లను తీసుకొచ్చిన ఫిలిప్పీన్స్‌ ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌ హోస్టెస్‌, ఇతర సిబ్బందిపై అక్కడి అధికారులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-01-15T08:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising