ఒబామా.. 6 ముస్లిం దేశాలపై 26వేల బాంబులు వేశారు
ABN, First Publish Date - 2023-06-26T01:35:17+05:30
భారత్‌లో ముస్లిం మైనారిటీల పరిస్థితిపై ప్రధాని మోదీతో చర్చిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల
న్యూఢిల్లీ, జూన్ 25: భారత్‌లో ముస్లిం మైనారిటీల పరిస్థితిపై ప్రధాని మోదీతో చర్చిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల మండిపడ్డారు. ఆయన చేసిన ఆరోపణలకు ఎలాంటి రుజువుల్లేవని పేర్కొన్నారు. ‘‘ఒబామా పాలనలో అమెరికా ఆరు ముస్లిం దేశాలపై 26వేల బాంబులతో దాడులు చేసింది. ఆయన మాటలను మనం నమ్మాలా? ఒబామా ఆరోపణలు నాకు విస్మయాన్ని కలిగించాయి. భారతదేశంలో పరిస్థితుల్ని ఉద్రిక్తంగా మార్చేందుకు జరిగే ప్రయత్నాలు ఇవి. బీజేపీని, మోదీని ఎన్నికల్లో ఎదుర్కొనలేక ప్రతిపక్షం ఇలాంటి ప్రచారాల్ని నిర్వహిస్తోంది’’ అని నిర్మల మండిపడ్డారు.
Updated Date - 2023-06-26T01:35:17+05:30 IST